Stock Market: 224 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

Stock Market: మిశ్రమంగా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Dhatripriya
Updated on: 2 Feb 2023 8:15 PM IST
Sensex ended with a gain of 224 points
X

Stock Market: 224 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా మిశ్రమంగానే ట్రేడింగ్‌ను ముగించాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో మార్కెట్లు ఊగిసలాట మధ్య మొదలయ్యాయి. చివరిలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీలో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో నిఫ్టీ ఫ్లాట్‌గా ముగిసింది. సెన్సెక్స్ 224 పాయింట్ల లాభంతో 59 వేల 933 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప నష్టంతో 17 వేల 612 వద్ద ముగిసింది. అదానీ గ్రూప్ షేర్ల పతనం ఇవాళ కొనసాగింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేరు ఏకంగా 27 శాతం నష్టపోయింది. మార్కెట్లు ముగిసే సమయానికి అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.17వద్ద నిలిచింది.

Dhatripriya

Dhatripriya

Next Story