మినిమమ్ బ్యాలెన్స్ తగ్గించిన ఎస్బీఐ

మినిమమ్ బ్యాలెన్స్ తగ్గించిన ఎస్బీఐ
x
Highlights

ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. తమ ఖాతాల్లో కస్టమర్లు ఉంచాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ ను తగ్గించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. తమ ఖాతాల్లో కస్టమర్లు ఉంచాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ ను తగ్గించింది. ఇంతకు ముందు పట్టణ ప్రాంతాల్లోని స్టేట్ బ్యాంక్ కస్టమర్లు తమ ఖాతాలో కనీసం 5 వేలు ఉంచాల్సి వచ్చేది. ఇప్పుడు దానిని మూడు వేలుగా మార్చారు. ఇక సెమీ అర్బన్ ప్రాంతాల్లో కనీసం 2 వేలు ఉంచాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వారికి వేయి రూపాయలు నిల్వ వుంచడం తప్పనిసరి. ఈ నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని ఎస్బీఐ తెలిపింది.

జరిమానాలు..

ఒకవేళ మినిమమ్ బ్యాలెన్స్ ఉంచడంలో ఖాతాదారుడు ఫెయిల్ అయితే, జరిమానాలు తప్పవు.

- పట్టణ ప్రాంతాల్లో కనీస నిల్వ 1500 మాత్రమే ఉంటే 10 రూపాయలు.. 750 కి తగ్గిపోతే, 12.75రూపాయలు పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది.

- ఇక సేవింగ్స్ ఖాతాలో 3 సార్లు మాత్రమె డిపాజిట్ చేసే వీలుంటుంది. ఇది దాటితే అదనపు పెనాల్టీ ఉంటుంది. తరువాత 100 రూపాయలు జమ చేసినా 50 రూపాయలు చార్జీలు వడ్డిస్తారు. దీనికి జిఎస్టి అదనం.

- నాన్ హోమ్ బ్రాంచీ ద్వారా గరిష్టంగా 2 లక్షలు మాత్రమే జమచేసే వీలుంటుంది.

- నెలకు పాతికవేల రూపాయల్ బ్యాలెన్స్ ఉంచే వ్యక్తులు రెండు సార్లు నగదు డ్రా చేసుకోవచ్చు.

- 25,000 నుంచి 50,000 మధ్య బ్యాలెన్స్ మెయింటెయిన్ చేసేవారికి 10 విత్ డ్రా చేసుకునే వీలుంటుంది.

- ఇక ఏటీఎంల ద్వారా నెలకు 10 సార్లు మెట్రో నగరాల్లోనూ, 12 సార్లు నాన్ మెట్రో నగరాల్లోనూ విత్ డ్రా చేసుకోవచ్చు.

- ఒకవేళ ఏ కారనంతోనైనా చెక్ బౌన్స్ అయితే 168 రూపాయలు జరిమానా విధిస్తారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories