వడ్డీరేట్లు తగ్గాయి..శుభవార్త చెప్పిన ఎస్బీఐ!

వడ్డీరేట్లు తగ్గాయి..శుభవార్త చెప్పిన ఎస్బీఐ!
x
Highlights

రుణ గ్రహీతలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. అదే సమయంలో దిపాజిట్లపైనా వడ్డీ రెట్లు తగ్గిస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌బీఐ) వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల కాలపరిమితి రుణాలపై వడ్డీని 10 బేసిన్‌ పాయింట్ల మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సవరించిన రుణ రేట్లు సెప్టెంబరు 10 నుంచి అమల్లోకి రానున్నట్లు ఎన్‌బీఐ తెలిపింది. ఆ బ్యాంకు రుణ గ్రహీతలకు ఇది శుభవార్తే అని చెప్పాలి.

ఇప్పటివరకు ఇది 8.25 శాతంగా ఉన్నఏడాది కాలపరిమితి ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాల రేటు కొత్త రేట్ల ప్రకారం... 8.15శాతంగా మారనుంది. కాగా.. ఈ ఆర్థికవత్సరంలో ఎన్‌బీఐ రుణ రేట్లను తగ్గించడం వరుసగా ఇది ఐదోసారి. దీంతో గృహరుణాలు మరింత చౌక అయ్యాయి. ఏప్రిల్‌ 10 నుంచి ఇప్పటివరకు 5 బేసిన్‌ పాయింట్ల మేర రుణాలపై వడ్డీరేట్లు తగ్గాయి. ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో ఆ ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయాలనే ఉద్దేశంతో ఎన్‌బీఐ కూడా రుణ రేట్లను తగ్గించింది.

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై కూడా

ఇక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనా వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ఎన్‌బీఐ ప్రకటించింది. అన్ని కాలపరిమితుల రిటైల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల పై 20 నుంచి 25 బేసిన్‌ పాయింట్లు, బల్క్‌ డిపాజిట్లపై 10 నుంచి 2 బేసిన్‌ పాయింట్ల మేర తగ్గించింది. ఈ రేట్లు కూడా రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. దీంతో ఏడాది నుంచి రెండేళ్ల కాలపరిమితి డిపాజిట్లపై 6.0 శాతం ఉన్న వడ్డీరేటు 6.50శాతానికి తగ్గింది. కాగా, డిపాజిట్లపై ఎన్‌బీఐ వడ్డీరేట్లు తగ్గించడం పదిహేను రోజుల్లో ఇది రెండోసారి. చివరిసారిగా ఆగస్టు 26న 10 నుంచి 50 బేసిన్‌ పాయింట్ల మేర వడ్డీరేట్లను తగ్గించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories