ప్రభుత్వరంగ బ్యాంకులు ఈఎంఐల వాయిదాలకు ఓకే.. స్పష్టత లేని ప్రైవేట్ బ్యాంకులు!

ప్రభుత్వరంగ బ్యాంకులు ఈఎంఐల వాయిదాలకు ఓకే.. స్పష్టత లేని ప్రైవేట్ బ్యాంకులు!
x
Highlights

కరోనా కల్లోలం నేపధ్యంలో రుణ గ్రహీతలకు నెలవారీ కట్టాల్సిన వాయిదాలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది. దీనికి ప్రభుత్వ రంగ...

కరోనా కల్లోలం నేపధ్యంలో రుణ గ్రహీతలకు నెలవారీ కట్టాల్సిన వాయిదాలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వం బ్యాంకులకు సూచించింది. దీనికి ప్రభుత్వ రంగ బ్యాకులు అంగీకరించాయి. ప్రైవేట్ బ్యాంకులు మాత్రం ఇంకా ఆర్బీఐ మార్గదర్శకాలను పరిశీలిస్తున్నామని చెబుతున్నాయి. ఇప్పుడు రుణ గ్రహీతలందరిలోనూ ఈ విషయంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ఇప్పటివరకూ ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రమె ఈ విషయంలో ఆర్బీఐ మార్గదర్శకాలను ఆచరిస్తామని ప్రకటించాయి.

- ప్రభుత్వరంగ సంస్థ ఎస్బీఐ మార్చి 1, 2020 నుంచి మే 31, 2020 మధ్య ఎస్‌బీఐ తన రుణాలపై వడ్డీ/ఈఎమ్‌ఐలను వాయిదా వేస్తున్నామని ప్రకటించింది.

- ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ లు కూడా ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా రుణాలపై వడ్డీ/ఈఎమ్‌ఐలను వాయిదా వేస్తున్నట్టు తెలిపాయి.

- ఈ వాయిదా కార్పొరేట్‌, ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ, వ్యవసాయ, రిటైల్‌, గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు వర్తిస్తాయని ప్రభుత్వరంగ బ్యాంకులు చెబుతున్నాయి.

- ఇక మిగిలిన ప్రబుత్వారంగ బ్యాకులుకూడా ఆర్బీఐ ప్రకటన వచ్చిన ఒక్కరోజులోనే రుణాలపై వడ్డీ/ఈఎమ్‌ఐలను వాయిదా వేస్తున్నట్టు తమ నిర్ణయాన్ని చెప్పాయి.

- ఇకపోతే ప్రయివేటు రంగ బ్యాంకులు మాత్రం ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకు వంటి ప్రైవేటు రంగ బ్యాంకులు మాత్రం ఇంకా ఆర్బీఐ మార్గదర్శకాలను పరిశీలిస్తున్నట్టు చెబుతున్నాయి.

రుణాలపై వడ్డీ/ఈఎమ్‌ఐలను వాయిదా విషయంలో, వాటిని ఎలా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అనే అంశంలో వినియోగదారులు తమ తమ బ్యాంకులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు రూల్స్ ప్రకారం వాయిదాలను చెల్లించడంలో ఆలస్యానికి రుసుములు వసూలు చేస్తాయి. కొన్ని ప్రయివేటు బ్యాంకులు ఈ విషయంలో అధిక పెనాల్టీలు విధిస్తాయి. ఒకవేళ ఇప్పడు బ్యాంకులను సంప్రదించకుండా రుణాలపై వడ్డీ/ఈఎమ్‌ఐలను కట్టలేకపోతే, తరువాతి కాలంలో అవి భారంగా పరిణమించే అవకాశం ఉంటుంది. బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వారు తమ, తమ బ్యాంకులకు సంప్రదించి రుణాల వాయిదాల చెల్లింపు విషయంలో ఎదురయ్యే ఇబ్బందులను తప్పించుకోవాల్సిన అవసరం ఉంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories