RBI Interest Rates: వడ్డీ రేట్లపై RBI కీలక ప్రకటన

RBI Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది.

Arun Chilukuri
Published on: 7 Jun 2024 11:34 AM IST
RBI Keeps Repo Rate Unchanged at 6.5% for Eighth Time
X

 

RBI Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. వడ్డీ రేట్లను వరుసగా 8వసారి యథాతంగా ఉంచుతున్నట్ట ప్రకటించింది ఆర్​బీఐ. ఈ మేరకు.. మొనేటరీ పాలసీ సమావేశం ముగింపు అనంతరం రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా గవర్నర్​ వెల్లడించారు. ద్రవ్యోల్బణం, వృద్ధి మధ్య సమతుల్యత అనుకూలంగా ఉందన్నారు. ఆహార ద్రవ్యోల్బణమే కొంత వరకు ఆందోళన కలిగిస్తోందని శక్తికాంత్ దాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story