రేపో రేటు తగ్గింపు..రుణాలపై మారిటోరియం పెంపు..ఆర్బీఐ తీపి కబురు!

రేపో రేటు తగ్గింపు..రుణాలపై మారిటోరియం పెంపు..ఆర్బీఐ తీపి కబురు!
x
RBI governor Shakthikantha Das (file photo)
Highlights

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా తో కాసేపటి క్రితం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన...

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ మీడియా తో కాసేపటి క్రితం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన తరువాత ఆర్బీఐ తీసుకోబోతున్న చర్యలను అయన వివరించారు. ఆర్ధిక మందగమనంతో ప్రభుత్వ ఆదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని శక్తికాంతదాస్ చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ తీసుకునే చర్యల గురించి ఆయన వివరించారు. ఆయన వెల్లడించిన ముఖ్య విషయాలు ఇవీ..

- ద్రవ్యోల్బణం అంచనా వేయడం చాలా కష్టంగా మారింది. మున్ముందు ద్రవ్యోల్బణం లాక్‌డౌన్‌ నిబంధనల అమలుపై ఆధారపడి ఉండోచ్చు.

- రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి(40 బేసిస్‌ పాయింట్లు) తగ్గింపు. రెపో రేటు తగ్గింపును 5-1 ఓట్లతో ఆరుగురు సభ్యుల కమిటీ ఆమోదించింది. ఈ నిర్ణయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న పరిశ్రమ వర్గాలకు కొంతమేర ఊరట లభిస్తుంది.

- టర్మ్‌లోన్లపై మారటోరియం మరో 90 రోజులు పొడిగింపు(జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు)

- మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్‌, ఉక్కు పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడింది. సిమెంట్‌ ఉత్పత్తిలో 25 శాతం తగ్గింది.

- మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17శాతం మేర పడిపోయింది. ఏప్రిల్‌లో తయారీ రంగం ఎన్నడూలేనంత క్షీణత నమోదు చేసింది.

- ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో ఆహార భద్రతకు భరోసా ఏర్పడింది. 'వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరగడంతో ఇది వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహకం ఉంటుంది.

- కూరగాయలు, నూనె గింజల ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

- 4 కేటగిరిలుగా ఎగుమతులు, దిగుమతులు పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

- వర్కింగ్ కేపిటల్ పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

- సిడ్‌బీ రుణాలపై మారటోరియం మరో 90 రోజులు పెంపు ఉంటుంది.

- జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు మారటోరియం పొడిగింపు ఉంటుంది.

- టర్మ్‌లోన్లకు వర్తించేలా మారటోరియం పొడిగింపు ఉంటుంది

- ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయి. కరోనా అనంతర పరిస్థితుల్లో డిమాండ్‌ ఆధారంగా ద్రవ్యోల్బణం భవిష్యత్తు. ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన సవాళ్లు పొంచి ఉన్నాయి.

- డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు తగ్గింది అని ఆర్‌బీఐ గవర్నర్‌ వివరించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories