RBI: బ్లాక్ పెన్నుతో చెక్కులను నింపడాన్ని నిషేధించిన ఆర్బీఐ ?

RBI: ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చెక్కులపై బ్లాక్ పెన్ వాడకాన్ని నిషేధించిందని పేర్కొంది.

CR Reddy
Updated on: 3 Feb 2025 1:55 PM IST
RBI
X

RBI: బ్లాక్ పెన్నుతో చెక్కులను నింపడాన్ని నిషేధించిన ఆర్బీఐ ?

RBI: ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చెక్కులపై బ్లాక్ పెన్ వాడకాన్ని నిషేధించిందని పేర్కొంది. ఈ వార్త ప్రజలను చాలా గందరగోళానికి గురిచేసింది. అందరూ ఇది నిజమే అని నమ్మారు. చాలా మంది దీని గురించి మాట్లాడటం, సోషల్ మీడియాలో చర్చలు పెట్టడం మొదలు పెట్టారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ వార్తను పూర్తిగా అబద్ధమని పేర్కొంది. చెక్కులపై బ్లాక్ పెన్ కు సంబంధించి ఆర్‌బిఐ ఎటువంటి కొత్త నియమాన్ని జారీ చేయలేదని పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న పుకారు మాత్రమే.

సోషల్ మీడియాలో పుకార్లు

చెక్కులపై ఇప్పుడు బ్లాక్ పెన్ ఉపయోగించలేమని సోషల్ మీడియాలో కొందరు వాదించారు. కానీ PIB ప్రకారం ఈ సమాచారం పూర్తిగా తప్పు అని నిరూపితం అయింది. ఈ విషయంలో ఆర్‌బిఐ ఎటువంటి మార్గదర్శకాలను ఇవ్వలేదు. కాబట్టి ఈ పుకారును ప్రజలు పట్టించుకోకపోవడం మంచింది. ఇదంతా ఎటువంటి అధికారిక సమాచారం లేకుండానే వ్యాప్తి చెందుతోంది.



చెక్కుల సరైన ఉపయోగం

చెక్కు అనేది డబ్బు లావాదేవీల కోసం ఉపయోగించే ఒక లిఖిత పత్రం. దీనిలో డబ్బు ఇచ్చే వ్యక్తి పేరు వ్రాయబడి ఉంటుంది. ఎటువంటి సమస్య రాకుండా చెక్కును సరిగ్గా నింపడం ముఖ్యం. స్కానింగ్, ప్రాసెసింగ్‌లో ఎటువంటి సమస్య లేకుండా చెక్కు స్పష్టంగా, ఎటువంటి తప్పులు లేకుండా నింపాలి.

కస్టమర్లకు సలహా

చెక్కులపై సిరా రంగుకు సంబంధించి నిర్దిష్ట నియమం లేదని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. సులభంగా స్కాన్ చేయగల కలర్ ఎంచుకోవాలి. పుకార్లను నమ్మకూడదు. సరైన సమాచారం కోసం ఎల్లప్పుడూ అధికారిక ఉత్తర్వులను మాత్రమే నమ్మాలి. కాబట్టి, ఈ పుకారు పూర్తిగా అబద్ధం. ఎలాంటి గందరగోళాన్ని నివారించడానికి సరైన సమాచారం కోసం ప్రభుత్వ వెబ్ సైట్ లను ఆశ్రయించాలి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story