Electric Hanger: దుస్తుల నుంచి సాక్స్‌ల వరకు.. వర్షంలో తడిచి కంపు కొడుతున్నాయా.. ఈ పోర్టబుల్ హ్యాంగర్‌ని ఇంటికి తెస్తే చాలు.. కేవలం రూ.549కే..!

Electric Hanger: వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలంలో బట్టలు తడిసి ముద్దవుతుంటాయి. వర్షంలో బట్టలే కాదు, బూట్లు కూడా తడిసిపోతుంటాయి. బట్టలు త్వరగా ఆరిపోతాయి. కానీ, బూట్లు పొడిగా అవ్వడానికి సమయం పడుతుంది.

Arun Chilukuri
Published on: 7 July 2023 11:37 AM IST
Portable Electric Clothes and Shoes Dryer Hanger RS 549 for Dry in Easily
X

Electric Hanger: దుస్తుల నుంచి సాక్స్‌ల వరకు.. వర్షంలో తడిచి కంపు కొడుతున్నాయా.. ఈ పోర్టబుల్ హ్యాంగర్‌ని ఇంటికి తెస్తే చాలు.. కేవలం రూ.549కే..!

Electric Hanger: వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలంలో బట్టలు తడిసి ముద్దవుతుంటాయి. వర్షంలో బట్టలే కాదు, బూట్లు కూడా తడిసిపోతుంటాయి. బట్టలు త్వరగా ఆరిపోతాయి. కానీ, బూట్లు పొడిగా అవ్వడానికి సమయం పడుతుంది. కానీ, ప్రస్తుతం అనేక ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చాయి. ఇవి త్వరగా వస్తువులను పొడిగా మార్చేస్తుంటాయి. ప్రస్తుతం మార్కెట్‌లోకి వచ్చిన కొత్త హ్యాంగర్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. దీని ద్వారా మీరు త్వరగా బట్టలు లేదా బూట్లు ఆరబెట్టవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పోర్టబుల్ ఎలక్ట్రిక్ క్లాత్స్ డ్రైయర్ హ్యాంగర్..

ఇది పోర్టబుల్ ఎలక్ట్రిక్ క్లాత్స్ డ్రైయర్ హ్యాంగర్. ఎలక్ట్రిక్ పవర్డ్ హ్యాంగర్ వేడి గాలిని వీస్తూ బట్టలు లేదా బూట్లు త్వరగా ఆరబెడుతుంది. అంటే మీకు సూర్యకాంతి కూడా అవసరం లేదు. విశేషమేమిటంటే, ఇది వాటిని పాడవకుండా పొడిగా చేయగలదు.

ఇది ఎలా పనిచేస్తుంది..

ఇది సాధారణ హ్యాంగర్ వంటిది. మీరు దానిని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బట్టలు లేదా బూట్లు తగలించుకోవచ్చు. ఆ తర్వాత ప్లగ్‌కి కనెక్ట్ చేస్తే చాలా. ఆ తర్వాత అది పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ హ్యాంగర్ పూర్తిగా ప్లాస్టిక్‌ది. కానీ, ఇది వేడి గాలికి కరగదు. ఎందుకంటే దీనిలో హార్డ్ ప్లాస్టిక్ ఉపయోగించారు. ఇందులో 5KG లోడ్ వేసుకోవచ్చు. మధ్యలో ఒక బటన్ ఉంటుంది. దానిని నొక్కడం ద్వారా ఆన్ చేయవచ్చు. పొడిగా ఉన్నప్పుడు, అదే బటన్‌ను నొక్కడం ద్వారా దాన్ని మూసివేయవచ్చు.

ధర కూడా తక్కువే..

ధర గురించి చెప్పాలంటే రూ.549 చెల్లించి కొనుగోలు చేయవచ్చు. మీరు దీన్ని ఏదైనా ఇ-కామర్స్ వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. దీన్ని ఆఫ్‌లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.500 నుంచి రూ.1000 వరకు ఉంటుంది.

మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేసి తెలసుకోండి: https://www.amazon.in/Jukkre-Folding-Electric-Portable-Clothing/dp/B08B8H17MP

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story