Petrol and Diesel Price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పరుగులు..

Petrol and Diesel Price: ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిన పెట్రోల్, డీజిల్ ధరలు

Sandeep Eggoju
Updated on: 18 Jun 2021 11:08 AM IST
Petrol Price Today in Hyderabad Vijayawada Diesel Rate Today in Delhi 18 06 2021
X

Representational Image

Petrol and Diesel Price: దేశంలో పెట్రో ధరల పరుగులు కొనసాగుతున్నాయి.శుక్రవారం రోజు లీటర్‌ పెట్రోల్‌ పై 43 పైసలు,డీజిల్‌ పై 45 పైసలు పెరిగాయి. హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ 100 రూపాయల 89 పైసలు వద్దకు చేరగా డీజిల్‌ ధర 95 రూపాయల 73 పైసలుగా నమోదయింది. ఇప్పటికే దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేశాయి.

ఆర్దిక రాజధాని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 103 రూపాయల మార్క్ ను దాటింది.ముంబై లో లీటర్ పెట్రోల్ 103 రూపాయల 08 పైసల వద్దకు చేరగా డీజిల్ ధర 95 రూపాయల 14 పైసలుగా నమోదయింది.దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 96 రూపాయల 93 పైసలుగా వుండగా డీజిల్ ధర 87 రూపాయల 69 పైసలు వద్దకి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర వంద రూపాయల మార్క్‌ను దాటింది. దేశంలోని ఉభయ తెలుగు రాష్ట్రాలతో సహా మొత్తం ఏడు రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్‌ ధరలు సెంచరీకి చేరాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story