Petrol Diesel Price Today: పైపైకి ఎగబాగుతున్న పెట్రోల్ ధరలు

Petrol Diesel Price Today: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ కొట్టి ముందుకు దూసుకెళుతున్నాయి.

Kranthi
Published on: 17 Jun 2021 7:27 AM IST
Petrol Price Today in Hyderabad Vijayawada Diesel Rate Today in Delhi 17 06 2021
X

Petrol Diesel Price Today:(File Image) 

Petrol Diesel Price Today: అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించని కేంద్రం... ఇప్పుడు ధరలు పెంచడానికి మాత్రం అంతర్జాతీయ ధరలే కారణమని చెబుతోంది. వీటికి తోడు కేంద్రం, రాష్ట్రాలు వేసే పన్నుల వల్ల పెట్రోల్, డీజిల్ వినియోగదారులపై విపరీతమైన భారం పడుతోంది. మరోవైపు ఈ ధరల వలన రవాణా చార్జీలు కూడా పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అసలే సంక్షోభం.. ఆ పై కోవిడ్ దెబ్బ.. వీటితో కుదేలైన సామాన్యుడు.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో తీవ్రంగా దెబ్బ తింటున్నాడు.

కాని దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలనే కారణమని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకొస్తున్నారు. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురుపై కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల.. ఒక లీటర్ పెట్రోల్, డీజీల్ ధరలు సెంచరీ కొట్టి ముందుకు దూసుకెళుతున్నాయి.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 96.66గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 87.41 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.82కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.84 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.96.58 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 90.25 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 97.91ఉండగా.. డీజిల్ ధర రూ.92.04గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.99.89 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.92.66 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 93.88 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.87.81గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో …

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.46 గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 95.28గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.74 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.95.54గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 101.03గా ఉండగా.. డీజిల్ ధర రూ. 95.79గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.75గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.55గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.46ఉండగా.. డీజిల్ ధర రూ.95.60 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.23 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 95.05గా ఉంది.

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ. 102.98 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 96.47 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 102.27 ఉండగా.. డీజిల్ ధర రూ.96.47గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.16లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.96.38 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.94 గా ఉండగా.. డీజిల్ ధర రూ.97.15గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 102.98 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.97.19 లకు లభిస్తోంది.

Kranthi

Kranthi

Next Story