Petrol Diesel Price Today: చుక్కలు చూపిస్తోన్న పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Diesel Price Today: నేడు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 26 పైసల చొప్పున పెంచాయి చమురు సంస్థలు.

Kranthi
Published on: 10 July 2021 9:57 AM IST
Petrol Price Today in Hyderabad Vijayawada Diesel Rate Today in Delhi 10 07 2021
X

Petrol Diesel Price Today:(File Image) 

Petrol Diesel Price Today: సామాన్యులకు ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రోజూ రోజుకూ పెట్రోల్, డిజిల్ ధరలు పెరగడం తప్ప తగ్గడం మాత్రం కనిపించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించని కేంద్రం... ఇప్పుడు ధరలు పెంచడానికి మాత్రం అంతర్జాతీయ ధరలే కారణమని చెబుతోంది. వీటికి తోడు కేంద్రం, రాష్ట్రాలు వేసే పన్నుల వల్ల పెట్రోల్, డీజిల్ వినియోగదారులపై విపరీతమైన భారం పడుతోంది. మరోవైపు ఈ ధరల వలన రవాణా చార్జీలు కూడా పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. అసలే సంక్షోభం.. ఆ పై కోవిడ్ దెబ్బ.. వీటితో కుదేలైన సామాన్యుడు.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో తీవ్రంగా దెబ్బ తింటున్నాడు. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురుపై కేంద్ర, రాష్ట్రాలు పన్నులు విధించడం వల్ల.. ఒక లీటర్ పెట్రోల్, డీజీల్ ధరలు సెంచరీ కొట్టి ముందుకు దూసుకెళుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఆంధ్ర‌ప్రదేశ్‌లో దాదాపు అన్ని ప‌ట్ట‌ణాల్లో సెంచరీని దాటేసింది. దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్ సహా అన్ని మెట్రో నగరాల్లో లీటర్‌ పెట్రోల్ ధర రూ.100 మార్క్‌ను దాటింది. ఈ క్రమంలో చమురు కంపెనీలు తాజాగా పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 26 పైసల చొప్పున పెంచాయి చమురు సంస్థలు.

దేశంలోని వివిధ నగరాల్లో...

దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.100.91కి చేరగా, డీజిల్‌ ధర రూ.89.88కి పెరిగింది. అదేవిధంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ రూ.106.93, డీజిల్‌ రూ.97.46, బెంగళూరులో పెట్రోల్‌ ధర రూ.104.29 ఉండగా, డీజిల్‌ ధర రూ.95.26కు చేరుకుంది. భోపాల్‌లో పెట్రోల్‌ ధర రూ.109.24, డీజిల్‌ ధర రూ.98.67 చేరుకుంది. కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ.101.01, డీజిల్‌ ధరరూ.92.97 ఉంది. అలాగే చెన్నైలో పెట్రోల్ ధర రూ.101.67 ఉండగా, డీజిల్‌ ధర రూ.94.39లకు చేరుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో …

హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 104.86 ఉండగా, డీజిల్‌ ధర రూ.97.96కి చేరింది. కరీంనగర్‌లో పెట్రోల్‌ ధర రూ. 105.37 ఉండగా, డీజిల్ ధర రూ.98.42 ఉంది.

విజయవాడలో పెట్రోల్‌ ధర 107.07 ఉండగా, డీజిల్‌ ధర రూ.99.60 ఉంది. విశాఖలో పెట్రోల్ ధర రూ.106.64 ఉండగా, డీజిల్‌ ధర రూ.99.15లకు చేరుకుంది.

Kranthi

Kranthi

Next Story