Petrol Price today 31-10-2019: మార్పు లేని పెట్రోల్ ధరలు

K V D Varma
Updated on: 31 Oct 2019 11:03 AM IST
Petrol Price today 31-10-2019: మార్పు లేని పెట్రోల్ ధరలు
X

వరుసగా రెండో రోజూ పెట్రోల్ ధరలు 31-10-2019 స్థిరంగా నిలిచాయి. గురువారం కూడా పెట్రోల్ ధరల్లో మార్పు చోటు చేసుకోలేదు. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 77.54 రూపాయల వద్ద నిలిచింది. ఇక డీజిల్ ధర 71.81 రూపాయల వద్దస్థిరంగా ఉంది. అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర 77.16 రూపాయలు గానూ, డీజిల్ ధర 71.11 రూపాయలు గాను నిలకడగా ఉన్నాయి.

ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర , డీజిల్ ధరలలో మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో అక్కడ పెట్రోల్ ధర లీటరు 76.80 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరు 70.77 రూపాయలుగానూ నిలిచాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పెట్రోల్ ధర 72.92గా డీజిల్ ధర 65.85 రూపాయలుగా ఉన్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలోను ఇలాగే ఉంది. దీంతో అక్కడ పెట్రోల్ లీటరుకు 78.54 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 69.01 రూపాయలుగానూ ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.


K V D Varma

K V D Varma

Next Story