స్థిరంగా పెట్రోల్ ధరలు

K V D Varma
Published on: 13 Nov 2019 11:54 AM IST
స్థిరంగా పెట్రోల్ ధరలు
X

రెండురోజుల నుంచి తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధర..మరోవైపు పెరుగుతూ వస్తున్న డీజిల్ ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. 13-11-2019 బుధవారం పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో పెట్రోల్ ధర 78.01 రూపాయల వద్ద నిలిచింది. డీజిల్ ధర కూడా నిలకడగా 71.80 రూపాయల వద్ద నిలిచింది.

అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర 77.61 రూపాయల వద్ద..డీజిల్ ధర 71.10 రూపాయల వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక విజయవాడలో కూడా పెట్రోల్, డీజిల్ ధర మార్పులేకుండా వున్నాయి. దీంతో అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 77.25 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 70.76 రూపాయలుగానూ నిలిచాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 73.10 రూపాయలుగానూ, డీజిల్ ధర 65.79 రూపాయలుగానూ ఉన్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలోను ఇలాగే ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 78.77 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 69.01రూపాయలుగానూ ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.

K V D Varma

K V D Varma

Next Story