పెట్రోల్ ధరలు పైపైకి.. డీజిల్ ధరలు కిందికి!

పెట్రోల్ ధరలు పైపైకి.. డీజిల్ ధరలు కిందికి!
x
Highlights

నిన్నటి లానే పెట్రోల్ ధరలు మిశ్రమంగా నమోదయ్యాయి. ఇటు పెట్రోల్ ధర పెరిగింది.. మరోవైపు డీజిల్ ధర తగ్గింది.. దేశీయంగా పెట్రోల్ ధరలు పైపైకి వెళుతున్నాయి....

నిన్నటి లానే పెట్రోల్ ధరలు మిశ్రమంగా నమోదయ్యాయి. ఇటు పెట్రోల్ ధర పెరిగింది.. మరోవైపు డీజిల్ ధర తగ్గింది.. దేశీయంగా పెట్రోల్ ధరలు పైపైకి వెళుతున్నాయి. అదేసమయంలో డీజిల్ ధరలు కింది చూపులు చూస్తున్నాయి. 12-11-2019 మంగళవారం పెట్రోల్ ధరలు మళ్లీ పెరుగుదల నమోదు చేశాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 11 పైసలు పెరిగింది. దీంతో 78.01 రూపాయలకు చేరింది. అయితే, డీజిల్ ధర కూడా లీటరుకు 6 పైసలు తగ్గి 71.80 రూపాయలకు చేరుకుంది.

అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర 10 పైసలు పెరిగి 77.61 రూపాయలు గానూ, డీజిల్ ధర 6 పైసలు తగ్గి 71.10 రూపాయలు గాను ఉన్నాయి. ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర తగ్గింది. దీంతో అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 11 పైసలు పెరిగి 77.25 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 6 పైసలు తగ్గి, 70.76 రూపాయలుగానూ నిలిచాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 10 పైసలు పెరిగితే, డీజిలు ధర లీటరుకు 6 పైసలు తగ్గింది. దీంతో, పెట్రోలు ధర 73.10 రూపాయలుగానూ, డీజిల్ ధర 65.79 రూపాయలుగానూ ఉన్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలోను ఇలాగే ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 10 పైసలు పెరిగితే, డీజిలు ధర లీటరుకు 6 పైసలు తగ్గింది. దీంతో, పెట్రోల్ 78.77 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 69.01రూపాయలుగానూ ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories