Petrol Price 06-11-2019:స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు!

ఆరు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్, డీజిలు ధరలు 06-11-2019 బుధవారం నిలకడగా ఉన్నాయి.

K V D Varma
Published on: 6 Nov 2019 9:32 AM IST
Petrol Price 06-11-2019:స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు!
X

ఆరు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరలు ఈరోజు స్థిరంగా నిలిచింది. ఇక డీజిల్ ధరలు కూడా ఎటువంటి మార్పూలేకుండా స్థిరంగా ఉన్నాయి. 06-11-2019 బుధవారం పెట్రోల్ ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 77.26 రూపాయల వద్ద నిలిచింది. ఇక డీజిల్ ధర స్థిరంగా 71.75 రూపాయల వద్ద ఉంది. అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర 76. 89 రూపాయలు గానూ, డీజిల్ ధర మార్పులు లేకుండా 71.06 రూపాయలు గాను ఉన్నాయి. ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర , డీజిల్ ధర స్థిరంగా ఉన్నాయి. దీంతో అక్కడ పెట్రోల్ ధర లీటరు 76.53 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరు 70.72 రూపాయలుగానూ నిలిచాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పెట్రోల్ ధర, డీజిలు యధాతథంగా ఉన్నాయి. దీంతో, పెట్రోలు ధర 72.60 రూపాయలుగానూ, డీజిల్ ధర 65.75 రూపాయలుగానూ ఉన్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలోను ఇలాగే ఉంది. అక్కడ పెట్రోల్ డీజిల్ నిలకడగా నిలిచాయి. దీంతో, పెట్రోల్ 78.28 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 68.96 రూపాయలుగానూ ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.


K V D Varma

K V D Varma

Next Story