ఈరోజు పెట్రోల్ ధరల్లో మార్పు లేదు.. నిలకడగానే డీజిల్ ధర!

పెరుగుతూ వస్తున్నపెట్రోల్ ధరలు ఈరోజు (02-12-2019) స్థిరంగా ఉన్నాయి. డీజిలు ధరల్లో కూడా ఎటువంటి మార్పూ చోటు చేసుకోలేదు.

K V D Varma
Published on: 2 Dec 2019 8:00 AM IST
ఈరోజు పెట్రోల్ ధరల్లో మార్పు లేదు.. నిలకడగానే డీజిల్ ధర!
X
Petrol Price today representational image

పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరలు ఈరోజు (02-12-2019) నిలకడగా ఉన్నాయి. మరో వైపు డీజిలు ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో నిన్నటి ధరలతో పోలిస్తే లీటరు పెట్రోల్ ధర నిలకడగా 79.74 రూపాయల వద్ద నిలిచింది. ఇక డీజిలు ధర మార్పులు లేకుండా 71.79 రూపాయల వద్ద నిలిచింది.

విజయవాడలో పెట్రోల్ ధర స్థిరంగా 78.93 రూపాయలు గానూ, డీజిలు ధర మార్పులేకుండా 70.75 రూపాయలుగానూ ఉన్నాయి. అమరావతి లోనూ పెట్రోల్ ధర మార్పులు లేకుండా 79.30 రూపాయలుగానూ, డీజిలు ధర కూడా మార్పులేకుండా 71.09 రూపాయల వద్ద స్థిరంగా ఉంది.

ఇక ఢిల్లీలోనూ పెట్రోల్ ధరలు మారలేదు. డీజిలు ధరల్లో కూడా మార్పు లేదు. ఇక్కడ పెట్రోల్ ధర స్థిరంగా 74.91 రూపాయల వద్ద, డీజిలు ధర మార్పులేకుండా 65.78 రూపాయలుగా స్థిరంగా ఉంది. అటు వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధరలు నిలకడగా 80.59 రూపాయలు గానూ, డీజిలు ధర మార్పులేకుండా 69.00 రూపాయలుగానూ ఉన్నాయి.


K V D Varma

K V D Varma

Next Story