Petrol Price Today 02-10-2019: స్వల్పంగా తగ్గిన పెట్రోల్.. స్థిరంగా డీజిల్!

Petrol Price Today 02-10-2019: స్వల్పంగా తగ్గిన పెట్రోల్.. స్థిరంగా డీజిల్!
x
Highlights

నిన్న స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు ఈరోజు కుడా తగ్గాయి. అయితే, డీజిల్ ధరలు మాత్రం స్థిరంగా నిలిచాయి.

నిన్న స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు ఈరోజు కుడా తగ్గాయి. అయితే, డీజిల్ ధరలు మాత్రం స్థిరంగా నిలిచాయి. 02-10-2019 శనివారం పెట్రోల్ ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 3 పైసలు తగ్గి 77.48 రూపాయల వద్ద నిలిచింది. ఇక డీజిల్ ధర ఎటువంటి మర్పూ లేకుండా 71.78 రూపాయల వద్దనిలిచింది.

అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర 3 పైసలు తగ్గి 77.10 రూపాయలు గానూ, డీజిల్ ధర మార్పులు లేకుండా 71.09 రూపాయలు గాను ఉన్నాయి. ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర 3 పైసలు తగ్గగా , డీజిల్ ధర స్థిరంగా ఉంది. దీంతో అక్కడ పెట్రోల్ ధర లీటరు 76.74 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరు 70.75 రూపాయలుగానూ నిలిచాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 5 పైసలు తగుదల నమోదు చేయగా, డీజిలు ఎతివంటి మార్పు లేకుండా నిలిచింది. దీంతో పెట్రోలు ధర 72.81 రూపాయలుగానూ, డీజిల్ ధర 65.80 రూపాయలుగానూ ఉన్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలోను ఇలాగే ఉంది. అక్కడ పెట్రోల్ లీటరుకు 3 పైసలు ద్గివచ్చింది. డీజిల్ మాత్రం నిలకడగా ఉంది. దీంతో పెట్రోల్ 78.48 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 68.99 రూపాయలుగానూ ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories