Petrol price today 01-11-2019: స్వల్పంగా దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol price today 01-11-2019: స్వల్పంగా దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు
x
Highlights

రెండు రోజులపాటు స్థిరంగా నిలిచిన పెట్రోల్ ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. 01-10-2019 శుక్రవారం పెట్రోల్ ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్...

రెండు రోజులపాటు స్థిరంగా నిలిచిన పెట్రోల్ ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. 01-10-2019 శుక్రవారం పెట్రోల్ ధరలు దిగివచ్చాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 3 పైసలు తగ్గి 77.51 రూపాయల వద్ద నిలిచింది. ఇక డీజిల్ ధర కూడా లీటరుకు 3 పైసలు తగ్గి, 71.78 రూపాయల వద్దకు చేరింది.

అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర 3 పైసలు తగ్గి 77.13 రూపాయలు గానూ, డీజిల్ ధర 2 పైసలు తగ్గి 71.09 రూపాయలు గాను ఉన్నాయి. ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర 3 పైసలు, డీజిల్ ధర 2 పైసలు తగ్గాయి. దీంతో అక్కడ పెట్రోల్ ధర లీటరు 76.77 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరు 70.75 రూపాయలుగానూ నిలిచాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ పెట్రోల్ ధర లీటరుకు 6 పైసలు, డీజిలు లీటరుకు 5 పైసలు తగ్గడంతో పెట్రోలు ధర 72.86 రూపాయలుగానూ, డీజిల్ ధర 65.80 రూపాయలుగానూ ఉన్నాయి. వాణిజ్య రాజధాని ముంబయిలోను ఇలాగే ఉంది. అక్కడ పెట్రోల్ లీటరుకు 3 పైసలు, డీజిలు 2 పైసలూ దిగాయి. దీంతో పెట్రోల్ 78.51 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 68.99 రూపాయలుగానూ ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది


Show Full Article
Print Article
More On
Next Story
More Stories