Petrol Price Today 28-10-2019: స్థిరంగా పెట్రోల్ ధరలు

K V D Varma
Published on: 28 Oct 2019 7:45 AM IST
Petrol Price Today 28-10-2019: స్థిరంగా పెట్రోల్ ధరలు
X

పెట్రోల్ ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ఎటువంటి మార్పులూ లేకుండా 77.60 రూపాయల వద్ద నిలిచింది. ఇక డీజిల్ ధర కూడా స్థిరంగానే 71.92 రూపాయలవద్ద ఉంది. అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర 77.23 రూపాయలు గానూ, డీజిల్ ధర 71.23 రూపాయలు గానూ నిలకడగా ఉన్నాయి. ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర , డీజిల్ ధర ల్లో మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో పెట్రోల్ ధర లీటరు 76.86 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరు 70.87 రూపాయలుగానూ నిలిచాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడా పెట్రోల్ ధర నిలకడగా ఉంది. దాంతో 72.98 రూపాయలుగా నిలిచింది. డీజిల్ ధర స్థిరంగా కొనసాగుతుండడం తో 65.95 రూపాయలుగా నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పెట్రోల్ , డీజిలు ధరలు ఎటువంటి మార్పులకూ లోనుకాలేదు. దీంతో పెట్రోల్ లీటరుకు 78.60 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 69.12 రూపాయలుగానూ నిలకడగా ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.


K V D Varma

K V D Varma

Next Story