Petrol Rate: గత మూడు వారాలుగా నిలకడగా పెట్రో ధరలు

Petrol Rate: ఇప్పటికే సరికొత్త గరిష్టానికి చేరిన పెట్రో ఉత్పత్తుల ధరలు

Sandeep Eggoju
Published on: 23 March 2021 9:10 AM IST
Petrol Price Stable from the Last Three Weeks
X
ఫైల్ ఇమేజ్ 

Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో గత మూడు వారాలుగా పెట్రో ధరలు స్థిరంగా నిలకడగా కొనసాగుతున్నాయి. గత ఫిబ్రవరి 27 న పెట్రో ధరలను సవరించగా అప్పట్నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు నెలల వ్యవధిలో పెట్రోల్ రేటు లీటర్ కు 4 రూపాయల 87 పైసలు డీజిల్ 4 రూపాయల 99 పైసల మేర పెరిగింది.

రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల 17 పెసల వద్ద స్థిరంగా కొనసాగుతుండగా ఆర్దిక రాజధాని ముంబై లో 97 రూపాయల 57 పైసల వద్దకు చేరింది. తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 94 రూపాయల 79 పైసలు ఏపీలోని మెట్రో నగరాల్లో 97 రూపాయల 24 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story