Petrol Rate: గత ఆరు రోజులుగా నిలకడగా ఇంధన ధరలు

Petrol Rate: ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 90 రూపాయల 40 పైసలు

Sandeep Eggoju
Published on: 21 April 2021 10:40 AM IST
Petrol Price is Stable From the Last 6 Days 21-04-2021
X

Representational Image

Petrol Rate: దేశంలో పెట్రోల్ ,డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.. మెట్రో నగరాల్లో పెట్రో ధరలు గత ఆరు రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 93.99 వద్ద, డీజిల్ ధర 88.05 వద్ద నిలకడగా కొనసాగుతున్నాయి.ఇక విజయవాడలోనూ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర 96.52 వద్ద ,డీజిల్ ధర 90.04 వద్ద నిలకడగా వున్నాయి...రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 90 రూపాయల 40 పైసలుగా వుండగా డీజిల్ ధర 80 రూపాయల 73 పైసలు వద్దకి చేరింది.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.52 శాతం పెరుగుదలతో 67.41 డాలర్లకు చేరింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.55 శాతం పెరుగుదలతో 63.79 డాలర్లకు ఎగసింది

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story