మెట్రోనగరాల్లో వంద రూపాయలకు చేరువలో పెట్రో ధరలు

* వరుసగా ఐదో రోజు పెరిగిన పెట్రో ధరలు * ముంబై లో 95 రూపాయలకు దగ్గరలో పెట్రోల్ ధర

Sandeep Eggoju
Published on: 13 Feb 2021 9:34 AM IST
Petrol Price is near to a hundred rupees in Meto Cities
X

Representational Image

దేశంలోని మెట్రోనగరాల్లో పెట్రో ధరలు వంద రూపాయల చేరువకు చేరి సరికొత్త రికార్డ్ సృష్టిస్తున్నాయి..వరుసగా ఐదో రోజు ఇంధన ధరలు పెరిగి సరికొత్త గరిష్ఠాలను తాకాయి గత ఐదు రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూపాయి 46 పైసలు పెరిగి, డీజిల్ లీటరుకు రూపాయి 55 పైసలు చొప్పున పెరిగాయి. పెట్రోలియం కంపెనీలు తాజాగా పెట్రోల్ పై 26 నుంచి 29 పైసలు డీజిల్ పై 34 నుంచి 38 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 88 రూపాయల 44 పైసలు, డీజిల్ 78 రూపాయల 74 పైసలు వద్దకు చేరాయి. ఆర్దిక రాజధాని ముంబై లో లీటర్ పెట్రోల్ ధర 94 రూపాయల 93 పైసలుగా నమోదవుతోంది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ 91 రూపాయల 96 పైసలు డీజిల్ 85 రూపాయల 89 పైసలు వద్ద కొనసాగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story