మళ్లీ తగ్గిన పెట్రోల్ ధరలు..ఎంతంటే..

మళ్లీ తగ్గిన పెట్రోల్ ధరలు..ఎంతంటే..
x
Highlights

పెట్రోల్ ధరలు శనివారమూ తగ్గాయి . హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ 9 పైసలు తగ్గింది. దీంతో పెట్రోల్ ధర 77.60 రూపాయలకు చేరింది. ఇక డీజిల్ ధర కూడా 5 పైసల మేర...

పెట్రోల్ ధరలు శనివారమూ తగ్గాయి . హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ 9 పైసలు తగ్గింది. దీంతో పెట్రోల్ ధర 77.60 రూపాయలకు చేరింది. ఇక డీజిల్ ధర కూడా 5 పైసల మేర తగ్గుదల నమోదు చేసింది దీంతో 71.92 రూపాయలైంది. అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర లీటరుకు 8 పైసలు తగ్గింది. దీంతో 77.23 రూపాయలు గా నిలిచింది. ఇక డీజిల్ ధర కూడా 5 పైసలు తగ్గడంతో 71.23 రూపాయల వద్దకు చేరింది. ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర , డీజిల్ ధర ల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. దీంతో పెట్రోల్ ధర లీటరుకు 8 పైసలు తగ్గి 76.86 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 6 పైసలు తగ్గి 70.87 రూపాయలుగానూ నిలిచాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడా పెట్రోల్ ధర లీటరుకు 8 పైసలు తగ్గింది. దాంతో 72.98 రూపాయలుగా నిలిచింది. డీజిల్ ధర లీటరుకు 5 పైసలు తగ్గడంతో 65.95 రూపాయలుగా నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు 8 పైసలు, డీజిలు లీటరుకు 5 పైసలు తగ్గడంతో, పెట్రోల్ లీటరుకు 78.60 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 69.12 రూపాయలుగానూ ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories