Today Petrol Price: పెట్రోల్ ధర పెరుగుతూనే ఉంది!

K V D Varma
Published on: 23 Sept 2019 9:48 AM IST
Today Petrol Price: పెట్రోల్ ధర పెరుగుతూనే ఉంది!
X

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరో రోజూ అదే తీరులో పెరిగాయి . ఆది వారం తో పోలిస్తే సోమవారం పెట్రోల్ 31 పైసలు, డీజిల్ 21పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 78.57 రూపాయలకు చేరింది. డీజిల్ 72.96 రూపాయలైంది.

ఇక అమరావతిలో 78.09 రూపాయలు, విజయవాడలో 78.14 రూపాయలు గానూ పెట్రోల్ ధరలు ఉన్నాయి. అదే విధంగా అమరావతిలో డీజిల్ ధర 72.14రూపాయలకు చేరుకుంది. విజయవాడ లో డీజిల్ ధర 72.20 రూపాయలుగా ఉంది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ముంబాయిలో పెట్రోల్ ధర 27 పైసలూ, డీజిల్ 22 పైసల మేర పెరిగాయి. దీంతో ముంబయిలో పెట్రోల్ ధర 79.57 రూపాయలు, డీజిల్ 70.22రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 73.91 రూపాయలుగానూ, డీజిల్ ధర 66.93 రూపాయలుగానూ ఉంది.


K V D Varma

K V D Varma

Next Story