ఆరో రోజూ పెరిగిన పెట్రోల్ ధర!

ఆరో రోజూ పెరిగిన పెట్రోల్ ధర!
x
Highlights

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరో రోజూ అదే తీరులో పెరిగాయి . శని వారం తో పోలిస్తే ఆది వారం పెట్రోల్ 29 పైసలు, డీజిల్ 23 పైసలు పెరిగాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరో రోజూ అదే తీరులో పెరిగాయి . శని వారం తో పోలిస్తే ఆది వారం పెట్రోల్ 29 పైసలు, డీజిల్ 23 పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 78.26 రూపాయలకు చేరింది. డీజిల్ 72.75రూపాయలైంది. ఇక అమరావతిలో పెట్రోల్ ధర 27 పైసలు పెరిగి 77.94రూపాయలు గానూ, డీజిల్ ధర 22 పైసలు పెరిగి 72.10 రూపాయలకు చేరింది. విజయవాడలోనూ పెట్రోల్ ధర 28 పైసలు పెరిగి రూ.77.58, డీజిల్ ధర 22 పైసలు పెరిగి 71.76 రూపాయలకు చేరుకుంది. ఇలా ఆరు రోజులుగా పెట్రోల్ ధరలు 28 నుంచి 30 పైసల మధ్యలో పెరుగుదల నమోదు చేస్తుండడం గమనార్హం.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ముంబాయిలో పెట్రోల్ ధర 27 పైసలూ, డీజిల్ 22 పైసల మేర పెరిగాయి. దీంతో ముంబయిలో పెట్రోల్ ధర 79.29 రూపాయలు, డీజిల్ 70.01రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 27 పైసలూ, డీజిల్ 21 పైసల మేర పెరగడంతో పెట్రోల్ ధర 73.62 రూపాయలుగానూ, డీజిల్ ధర 66.74 రూపాయలుగానూ ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories