Petrol Price Today 21.10.2019: స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు

వరుసగా ఆరో రోజూ పెట్రోల్ ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్న కొద్దిగా తగ్గిన డీజిల్ ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. 21.10.2019 సోమవారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర ఎటువంటి మార్పులకూ లోనుకాలేదు. దీంతో పెట్రోల్ ధర 77.91రూపాయల వద్ద ఉండగా, డీజిల్ ధర కూడా నిలకడగా లీటరుకు 72.27 రూపాయల వద్ద వుంది.

K V D Varma
Published on: 21 Oct 2019 8:43 AM IST
Petrol Price Today 21.10.2019: స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు
X

వరుసగా ఆరో రోజూ పెట్రోల్ ధరలు నిలకడగా ఉన్నాయి. నిన్న కొద్దిగా తగ్గిన డీజిల్ ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. 21.10.2019 సోమవారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర ఎటువంటి మార్పులకూ లోనుకాలేదు. దీంతో పెట్రోల్ ధర 77.91రూపాయల వద్ద ఉండగా, డీజిల్ ధర కూడా నిలకడగా లీటరుకు 72.27 రూపాయల వద్ద వుంది. ఇక అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధరల్లో మార్పు లేదు. దీంతో పెట్రోల్‌ ధర 77.52 రూపాయలు గానే ఉంది. ఇక ఇక్కడా డీజిల్ ధర స్థిరంగా 71.52 రూపాయల వద్ద ఉంది. ఇక విజయవాడలో కూడా ఎటువంటి మార్పులు లేకుండా పెట్రోల్ ధర 77.16, డీజిల్ ధర కూడా అదేవిధంగా మార్పులు లేకుద్నా 71.17 రూపాయల వద్ద నిలిచింది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధరల్లో మార్పులు లేవు. దీంతో అక్కడ పెట్రోల్ ధర 73.27 రూపాయలు ఉండగా డీజిల్ ధర కూడా ఎటువంటి మార్పులు లేకుండా లీటరుకు 66.17 రూపాయలుగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ ధర 78.88 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 69.35 రూపాయలుగానూ నిలిచాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.


K V D Varma

K V D Varma

Next Story