పెట్రోల్ ధర పెరుగుతూనే ఉంది!

పెట్రోల్ ధర పెరుగుతూనే ఉంది!
x
Highlights

పెట్రోల్ ధరలు క్రమం తప్పకుండా పై పైకి చేరుతున్నాయి. కనీ కనిపించకుండా ఈ మూడు, నాలుగు రోజుల్లో సుమారు రూపాయి పైగా పెరిగింది. శుక్రవారం 30 పైసల మేర పెట్రోల్ ధర పెరిగింది.

దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. గురువారం కంటే శుక్రవారం పెట్రోల్ ధర 38 పైసలూ, డీజిల్ ౩౦ పైసల మేర పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 77.67 రూపాయలకు చేరింది. ఇక డీజిల్ 72.26రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా అమరావతిలోనూ పెట్రోల్ ధర లో 36 పైసల పెరుగుదల చోటుచేసుకుంది. దీంతో శుక్రవారం పెట్రోల్ ధర 77.37 రూపాయలు, డీజిల్ ధరలోనూ 30 పైసల పెరుగుదలతో 71.63 రూపాయలకు చేరుకున్నాయి. ఇక విజయవాడలో పెట్రోల్ ధర 36 పైసలు పెరుగుదలతో 77.00కు చేరింది. డీజిల్ ధర కూడా 29 పైసలు పెరుగుదలతో రూ.71.28కు పెరిగింది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ పెరిగింది. దీంతో ముంబయిలో పెట్రోల్ ధర 34 పైసలు పెరిగి 78.73రూపాయలు గానూ, డీజిల్ ధర 30 పైసలు పెరిగి 69.54 రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 35 పైసలు పెరిగి 73.36రూపాయలుగానూ, డీజిల్ ధర 28 పైసలు పెరిగి 66.29 రూపాయలుగానూ ఉంది.

ఇక అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు శుక్రవారం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిలు ధర 63.83 డాలర్లు (0.79 శాతం పెరుగుదల) గానూ, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 58.81 డాలర్లు (1.07 శాతం పెరుగుదల) గానూ ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories