Petrol Price Today 20.10.2019: ఐదో రోజూ స్థిరంగా పెట్రోల్ ధర..స్వల్పంగా తగ్గిన డీజిల్!

వరుసగా ఐదో రోజూ పెట్రోల్ ధరలు నిలకడగా ఉన్నాయి. డీజిల్ ధరలు కొద్దిగా తగ్గాయి. 20.10.2019 ఆదివారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర ఎటువంటి మార్పులకూ లోనుకాలేదు. డీజిలు ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.

K V D Varma
Published on: 20 Oct 2019 6:30 AM IST
Petrol Price Today 20.10.2019: ఐదో రోజూ స్థిరంగా పెట్రోల్ ధర..స్వల్పంగా తగ్గిన డీజిల్!
X

వరుసగా ఐదో రోజూ పెట్రోల్ ధరలు నిలకడగా ఉన్నాయి. డీజిల్ ధరలు కొద్దిగా తగ్గాయి. 20.10.2019 ఆదివారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర ఎటువంటి మార్పులకూ లోనుకాలేదు. దీంతో పెట్రోల్ ధర 77.91రూపాయల వద్ద ఉండగా, డీజిల్ ధర లీటరుకు 8 పైసలు తగ్గింది. దీంతో 72.27 రూపాయలకు చేరింది. ఇక అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధరల్లో మార్పు లేదు. దీంతో పెట్రోల్‌ ధర 77.52 రూపాయలు గానే ఉంది. కాగా, ఇక్కడా డీజిల్ ధర లీటరుకు 7 పైసలు తగ్గింది. 71.52 రూపాయల వద్ద ఉంది. ఇక విజయవాడలో కూడా ఎటువంటి మార్పులు లేకుండా పెట్రోల్ ధర 77.16, డీజిల్ ధర లీటరుకు 8 పైసలు తగ్గి 71.17 రూపాయల వద్ద కు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధరల్లో మార్పులు లేవు. దీంతో అక్కడ పెట్రోల్ ధర 73.27 రూపాయలు ఉండగా డీజిల్ ధర లీటరుకు 7 పైసలు తగ్గి 66.24 రూపాయలుగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ ధర 78.88 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 7 పైసలు తగ్గి 69.43 రూపాయలుగానూ నిలిచాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.


K V D Varma

K V D Varma

Next Story