Petrol Price today: స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు. డీజిల్ కూడా అంతే!

వరుసగా నాలుగో రోజూ పెట్రోల్ ధరలు నిలకడగా ఉన్నాయి. డీజిల్ ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. 19.10.2019 శనివారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర ఎటువంటి మార్పులకూ లోనుకాలేదు.

K V D Varma
Updated on: 19 Oct 2019 7:42 AM IST
Petrol Price today: స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు. డీజిల్ కూడా అంతే!
X

వరుసగా నాలుగో రోజూ పెట్రోల్ ధరలు నిలకడగా ఉన్నాయి. డీజిల్ ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి. 19.10.2019 శనివారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర ఎటువంటి మార్పులకూ లోనుకాలేదు. దీంతో పెట్రోల్ ధర 77.91రూపాయల వద్ద ఉండగా, డీజిల్ ధర లీటరుకు 72.31 రూపాయల వద్ద నిలిచింది. ఇక అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధరల్లో మార్పు లేదు. దీంతో పెట్రోల్‌ ధర 77.52 రూపాయలు గానే ఉంది. కాగా, ఇక్కడా డీజిల్ ధర లీటరు 71.59 రూపాయల వద్ద ఉంది. ఇక విజయవాడలో కూడా ఎటువంటి మార్పులు లేకుండా పెట్రోల్ ధర 77.16, డీజిల్ ధర 71.25 రూపాయల వద్ద నిలిచాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధరల్లో మార్పులు లేవు. దీంతో అక్కడ పెట్రోల్ ధర 73.27 రూపాయలు ఉండగా డీజిల్ ధర లీటరుకు 66.31 రూపాయలుగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధరలు నిలకడ గా ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ ధర 78.88 రూపాయలుగానూ, 69.50 రూపాయలుగానూ నిలిచాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.


K V D Varma

K V D Varma

Next Story