Petrol Price Today: మార్పులు లేని పెట్రోల్..తగ్గిన డీజిల్!

వరుసగా మూడోరోజూ పెట్రోల్ ధరలు నిలకడగా ఉన్నాయి. అయితే డీజిల్ ధరలు కొంచెం తగ్గుదల నమోదు చేశాయి. 18.10.2019 గురువారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర ఎటువంటి మార్పులకూ లోనుకాలేదు.

K V D Varma
Published on: 18 Oct 2019 8:44 AM IST
Petrol Price Today: మార్పులు లేని పెట్రోల్..తగ్గిన డీజిల్!
X

వరుసగా మూడోరోజూ పెట్రోల్ ధరలు నిలకడగా ఉన్నాయి. అయితే డీజిల్ ధరలు కొంచెం తగ్గుదల నమోదు చేశాయి. 18.10.2019 గురువారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర ఎటువంటి మార్పులకూ లోనుకాలేదు. దీంతో పెట్రోల్ ధర 77.91రూపాయల వద్ద ఉండగా, డీజిల్ ధర లీటరుకు 11 పైసలు తగ్గింది. దీంతో 72.31 రూపాయలకు చేరుకుంది. ఇక అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధరల్లో మార్పు లేదు. దీంతో పెట్రోల్‌ ధర 77.52 రూపాయలు గానే ఉంది. కాగా, ఇక్కడా డీజిల్ ధర లీటరుకు 11 పైసలు తగ్గింది. దీంతో 71.59 రూపాయలకు తగ్గింది. ఇక విజయవాడలో కూడా ఎటువంటి మార్పులు లేకుండా పెట్రోల్ ధర 77.16, లీటరుకు 10 పైసలు తగ్గడంతో డీజిల్ ధర 71.25 రూపాయల వద్ద నిలిచింది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధరల్లో మార్పులు లేవు. దీంతో అక్కడ పెట్రోల్ ధర 73.27 రూపాయలు ఉండగా డీజిల్ ధర లీటరుకు 10 పైసలు తగ్గడంతో 66.31 రూపాయలుగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధరలు నిలకడ గా ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ ధర 78.88 రూపాయలుగానూ, లీటరుకు 11 పైసలు తగ్గింది. దీంతో డీజిల్ ధర 69.50 రూపాయలకు తగ్గింది.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.


K V D Varma

K V D Varma

Next Story