Petrol Price Today: స్థిరంగా పెట్రోల్ ధరలు

K V D Varma
Published on: 16 Oct 2019 8:25 AM IST
Petrol Price Today: స్థిరంగా పెట్రోల్ ధరలు
X

నిన్న స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి. బుధవారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర ఎటువంటి మార్పులకూ లోనుకాలేదు. దీంతో పెట్రోల్ ధర 77.91రూపాయల వద్ద, డీజిల్ ధర రూ.72.42రూపాయల వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక అమరావతిలోనూ ఇదే పరిస్థతి వుంది. ఇక్కడా పెట్రోల్ ధరల్లో మార్పు లేదు. దీంతో పెట్రోల్‌ ధర 77.52 రూపాయలు, డీజిల్‌ ధర 71.70 రూపాయలుగానూ ఉంది. ఇక విజయవాడలో కూడా ఎటువంటి మార్పులు లేకుండా పెట్రోల్ ధర 77.16, డీజిల్ ధర 71.35 రూపాయల వద్ద నిలిచింది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధరల్లో మార్పులు లేవు. దీంతో అక్కడ పెట్రోల్ ధర 73.27 రూపాయలు ఉండగా డీజిల్ ధర కూడా 69.61 రూపాయలుగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధరలు నిలకడ గా ఉన్నాయి. ఇక్కడ పెట్రోల్ ధర 78.88 రూపాయలుగానూ, డీజిల్ ధర 69.61 రూపాయలుగానూ ఉంది.


K V D Varma

K V D Varma

Next Story