Petrol Price Today: తగ్గిన పెట్రోల్ ధరలు

Petrol Price Today: తగ్గిన పెట్రోల్ ధరలు
x
Highlights

రెండోరోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. మంగళవారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 6 పైసలు, డీజిల్ ధర 5 పైసలు తగ్గింది....

రెండోరోజులుగా నిలకడగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు కొద్దిగా తగ్గాయి. మంగళవారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర 6 పైసలు, డీజిల్ ధర 5 పైసలు తగ్గింది. దీంతో పెట్రోల్ ధర 77.91రూపాయలకు, డీజిల్ ధర రూ.72.42రూపాయలకు దిగి వచ్చాయి.

ఇక అమరావతిలో లీటరు పెట్రోల్ ధర 6 పైసలు, డీజిల్ ధర 5 పైసలు తగ్గింది. దీంతో పెట్రోల్‌ ధర 77.52 రూపాయలు, డీజిల్‌ ధర 71.70 రూపయలుగానూ ఉంది. ఇక విజయవాడలో లీటరు పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 6 పైసలు తగ్గింది. దీంతోపెట్రోల్ ధర 77.16, డీజిల్ ధర 71.35 రూపాయలకు తగ్గింది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా లీటరు పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 5 పైసలు తగ్గింది. దీంతో అక్కడ పెట్రోల్ ధర 73.27 రూపాయలు ఉండగా డీజిల్ ధర కూడా 69.61 రూపాయలుగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్ ధర 5 పైసలు, డీజిల్ ధర 5 పైసలు తగ్గింది. దీంతో పెట్రోల్ ధర 78.88 రూపయలుగానూ, డీజిల్ ధర 69.61 రూపాయలుగానూ ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories