Petrol Price Today: రెండోరోజూ నిలకడగా పెట్రోల్ ధరలు

K V D Varma
Published on: 14 Oct 2019 7:42 AM IST
Petrol Price Today: రెండోరోజూ నిలకడగా పెట్రోల్ ధరలు
X

రెండోరోజూ పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు లేకుండా నిలకడగా కొనసాగుతున్నాయి. సోమవారం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.77.97 వద్ద నిలకడగా ఉండగా. డీజిల్ ధర రూ.72.47 వద్ద స్థిరంగా కొనసాగింది. ఇక అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.77.58 ఉండగా డీజిల్‌ ధర రూ.71.75 వద్ద ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.77.21 వద్ద ఉంది. డీజిల్ ధర రూ.71.41 వద్దనే కొనసాగుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. అక్కడ పెట్రోల్ ధర రూ.73.32 ఉండగా డీజిల్ ధర కూడా రూ.66.46 వద్ద నిలకడగా ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో పెట్రోల్ ధర రూ.78.93 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్ ధర రూ.69.66 వద్ద నిలకడగా కొనసాగుతోంది.


K V D Varma

K V D Varma

Next Story