Petrol Price Today: పెట్రోలు ధరలు ఈరోజూ తగ్గాయి..

K V D Varma
Published on: 11 Oct 2019 9:18 AM IST
Petrol Price Today: పెట్రోలు ధరలు ఈరోజూ తగ్గాయి..
X

ఈరోజూ పెట్రోల్ ధరలు కొంత మేర తగ్గాయి. దేశీయంగా పెట్రోల్ ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ లో గురువారం పెట్రోల్ ధర లీటరుకు 13 పైసలు, డీజిల్ ధర లీటరుకు 17 పైసలు తగ్గింది. దీంతో లీటరు పెట్రోల్ ధర 78.07రూపాయలు, డీజిల్ ధర 72.62 రూపాయలుగానూ నిలిచింది. అమరావతిలోనూ పెట్రోల్ ధర, డీజిల్ ధరలు తగ్గాయి. శుక్రవారం పెట్రోల్ ధర లీటరుకు 12 పైసలు, డీజిల్ ధర లీటరుకు 15 పైసలు తగ్గింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర 77.68 రూపాయలవద్ద, డీజిల్ ధర 71.90 రూపాయలుగానూ ఉంది. అదేవిధంగా విజయవాడలో కూడా శుక్రవారం పెట్రోల్ ధర లీటరుకు 12 పైసలు, డీజిల్ ధర లీటరుకు 16 పైసలు తగ్గింది. పెట్రోల్ 77.31 రూపాయలు డీజిల్ 71.55 రూపాయలుగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగానూ పెట్రోల్ ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి.ముంబాయిలో పెట్రోల్ ధర లీటరుకు 12 పైసలు, డీజిల్ ధర లీటరుకు 15 పైసలు తగ్గింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర 79.03 రూపాయలు, డీజిల్ ధర 69.81 రూపాయలుగానూ ఉంది. అదేవిధంగా దిల్లీలో కూడా పెట్రోల్ ధర లీటరుకు 12 పైసలు, డీజిల్ ధర లీటరుకు 15 పైసలు తగ్గింది. పెట్రోల్ ధర 73.42 రూపాయలు, డీజిల్ 66.60 రూపాయలకు తగ్గింది.


K V D Varma

K V D Varma

Next Story