Petrol Price Today: ఎటువంటి మార్పులూ లేకుండా కొనసాగుతున్న పెట్రోల్ ధరలు
అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరిగినప్పటికీ.. ఆరు రుజులుగా దేశీయంగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరలు బుధవారం స్థిరంగా ఉన్నాయి. మంగళవారం నాటి ధరలే బుధవారమూ కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర 78.25 రూపాయలు, డీజిల్ ధర 72.85 రూపాయలుగానూ నిలిచింది. అమరావతిలోనూ పెట్రోల్ ధర, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర 77.85 రూపాయలవద్ద, డీజిల్ ధర 72.12 రూపాయాలవద్ద నిలిచాయి. అదేవిధంగా విజయవాడలో కూడాఉంది. పెట్రోల్ 77.49 రూపాయలు డీజిల్ 71.77 రూపాయలు నిలకడ గా ఉన్నాయి.
దేశవ్యాప్తంగానూ పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ముంబాయిలో పెట్రోల్ ధర 79.20 రూపాయలు, డీజిల్ ధర 70.03 రూపాయలు ఉంది. అదేవిధంగా దిల్లీలో కూడా పెట్రోల్ ధర 73.59 రూపాయలు, డీజిల్ 66.81 రూపాయలతొ ఎటువంటి మార్పు లేకుండా కొనసాగుతున్నాయి.
Next Story


