Petrol Price Today: నిలకడగా పెట్రోల్ ధరలు

K V D Varma
Published on: 6 Oct 2019 7:38 AM IST
Petrol Price Today: నిలకడగా పెట్రోల్ ధరలు
X

అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరిగినప్పటికీ.. దేశీయంగా పెట్రోల్ ధరలు నిలకడగా ఉన్నాయి. మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న పెట్రోల్ ధరలు ఆదివారం నిలకడగా ఉన్నాయి. శనివారంతో పోల్చుకుంటే ఆదివారం హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర మార్పులు లేకుండా 78.73 రూపాయల వద్దే వుంది. ఇక డీజిల్ ధర కూడా 73.22 రూపాయల వద్దే ఉంది. అమరావతిలోనూ ఇదే పరిస్థితి. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర 78.32 రూపాయలకు, డీజిల్ ధర 72.47 రూపాయాలుగా ఉంది. అదేవిధంగా విజయవాడలో కూడా పెట్రోల్ ధర పెట్రోల్ 77.95 రూపాయలకు, డీజిల్ 72.13 రూపాయలతో నిలకడగా ఉంటాయి.

దేశవ్యాప్తంగానూ పెట్రోల్ ధరలు దిగివచ్చాయి. ముంబాయిలో పెట్రోల్ ధర 28 పైసలు.. డీజిల్ ధర 22 పైసలు తగ్గాయి. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర 79.65 రూపాయలకు, డీజిల్ ధర 70.39 రూపాయలకు తగ్గింది. అదేవిధంగా దిల్లీలో కూడా పెట్రోల్ ధర 29 పైసలు.. డీజిల్ ధర 20 పైసలు తగ్గి పెట్రోల్ 74.04 రూపాయలకు, డీజిల్ 67.15 రూపాయలకు దిగింది.






K V D Varma

K V D Varma

Next Story