Today Petrol Price: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటి తో పోలిస్తే ఈరోజు కూడా అదే ధరలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయంగా క్రూదాయిలు ధరలు స్వల్పంగా పెరిగాయి.

K V D Varma
Published on: 9 Sept 2019 8:09 AM IST
Today Petrol Price: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు
X

అంతర్జాతీయంగా క్రూదాయిలు ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఉన్నధరలే సోమవారమూ కొనసాగనున్నాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 76.23 రూపాయలు, డీజిల్ 70.96 రూపాయల వద్ద స్థిరంగా ఉన్నాయి. అమరావతిలో పెట్రోల్ ధర 75.98 రూపాయలు, డీజిల్ 70.37 రూపాయల వద్దా, విజయవాడలో పెట్రోల్ ధర 75.61 రూపాయలు, డీజిల్ 70.03 రూపాయల వద్దా నిలకడగా కొనసాగుతున్నాయి.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ డీజిల్ ధరలు ఆదివారం ధరల్లానే ఎలాంటి మార్పూ లేకుండా ఉన్నాయి. ముంబయిలో పెట్రోల్ ధర 77.40 రూపాయలు, డీజిల్ 68.26 రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 71.71 రూపాయలుగానూ, డీజిల్ ధర 65.09రూపాయలుగానూ ఉంది.

ఇక అంతర్జాతీయంగా క్రూదాయిలు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిలు ధర 61.62 డాలర్లు (0.13 శాతం పెరుగుదల) గానూ, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 56.74 డాలర్లు (0.39 శాతం పెరుగుదల) గానూ ఉన్నాయి.


K V D Varma

K V D Varma

Next Story