Petrol Price Today: రెండో రోజూ మార్పు లేని పెట్రోల్ ధరలు!

K V D Varma
Published on: 29 Sept 2019 9:21 AM IST
Petrol Price Today: రెండో రోజూ మార్పు లేని పెట్రోల్ ధరలు!
X

దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు రెండో రోజూ ఆదివారం స్థిరంగానే ఉన్నాయి. శుక్రవారం నాటి పెట్రోల్ ధరలే ఆదివారమూ కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 79.02 రూపాయలు, డీజిల్ 73.29రూపాయల వద్ద నిలకడగా ఉన్నాయి. అదేవిధంగా అమరావతిలోనూ పెట్రోల్ ధర 78.69 రూపాయలు, డీజిల్ ధర 72.62 రూపాయలు గానూ మార్పు లేకుండా ఉన్నాయి. ఇక విజయవాడలో పెట్రోల్ ధర 78.32 రూపాయలు, డీజిల్ ధర కూడా 72.28 రూపయలుగానూ నిలిచాయి.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ముంబయిలో పెట్రోల్ ధర 80.00రూపాయలు గానూ, డీజిల్ ధర 70.55 రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 74.34 రూపాయలుగానూ, డీజిల్ ధర 67.24 రూపాయలుగానూ ఉంది.


K V D Varma

K V D Varma

Next Story