హమ్మయ్య.. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులేదు!

K V D Varma
Updated on: 25 Sept 2019 1:32 PM IST
హమ్మయ్య.. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలలో మార్పులేదు!
X

ఎనిమిది రోజులుగా భారీగా పెరుగుతూ వస్తున్నా పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. గత ఎనిమిది రోజుల్లోనే పెట్రోల్ 2 రూపాయలు, డీజిల్ 1.63 రూపాయలూ పెరగి షాక్ ఇచ్చిన పెట్రోల్ ధరలు బుధవారం ఎటువంటి మార్పు లేకుండా ఉండి కొంత ఊపిరి తీసుకునేలా చేశాయి.

ఇక మంగళవారం తో పోలిస్తే బుధవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులేదు. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 78.80 రూపాయలుగా ఉంది. డీజిల్ 73.11 రూపాయలుంది. ఇక అమరావతిలో నూ అదే పరిస్థితి ఉంది. ఇక్కడ పెట్రోల్ 78.47 రూపాయలు గానూ, డీజిల్ ధర 72.44 రూపాయలుగానూ స్థిరంగా ఉంది. విజయవాడలోనూ పెట్రోల్ ధర రూ.78.10, డీజిల్ ధర 72.10 రూపాయలుగా నిలకడగా ఉంది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ ధరల్లో మార్పు లేదు. ముంబాయిలో పెట్రోల్ ధర 79.72రూపాయలు, డీజిల్ 70.37 రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 74.13 రూపాయలుగానూ, డీజిల్ ధర 67.07 రూపాయలుగానూ ఉంది.


K V D Varma

K V D Varma

Next Story