ఈ రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

ఈ రోజూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
x
Highlights

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు శుక్రవారం తగ్గినప్పటికీ దేశీయంగా మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.

అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు కొద్దిగా తగ్గినప్పటికీ, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ ఈరోజూ పెరిగాయి. గురువారం కంటే శుక్రవారం పెట్రోల్ ధర 7పైసలూ, డీజిల్ 9 పైసల మేర పెరిగాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 76.42 రూపాయలకు చేరింది. ఇక డీజిల్ 71.16 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా అమరావతిలోనూ 7 పైసల పెరుగుదల చోటుచేసుకుంది. దీంతో శుక్రవారం పెట్రోల్ ధర 76.16 రూపాయలు, డీజిల్ ధరలో 9 పైసల పెరుగుదలతో 70.57రూపాయలకు చేరుకున్నాయి. ఇక విజయవాడలో పెట్రోల్ ధర 8 పైసలు పెరుగుదలతో రూ.75.80కు చేరింది. డీజిల్ ధర కూడా 10 పైసలు పెరుగుదలతో రూ.70.23కు పెరిగింది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ ధర 7పైసలూ, డీజిల్ 9 పైసల మేర పెరిగాయి. దీంతో ముంబయిలో పెట్రోల్ ధర 77.57రూపాయలు, డీజిల్ 68.46రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 71.89రూపాయలుగానూ, డీజిల్ ధర 65.28రూపాయలుగానూ ఉంది.

ఇక అంతర్జాతీయంగా క్రూడాయిలు ధరలు గురువారంతో పోల్చుకుంటే శుక్రవారం తాగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిలు ధర 60.25 డాలర్లు (0.22 శాతం తగ్గుదల) గానూ, డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 54.98 డాలర్లు (0.20 శాతం తగ్గుదల) గానూ ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories