Petrol Rate: మెట్రో నగరాల్లో స్థిరంగా పెట్రో ధరలు

Petrol Rate: హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.94.16 * హైదరాబాద్ లో లీటర్ డీజిల్ ధర 88 రూపాయల 20 పైసలు

Sandeep Eggoju
Updated on: 31 March 2021 12:02 PM IST
Petrol and Diesel Price Stable in Indian Metro Cities-30-03-2021
X

Representational Image

Petrol Rate: దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. నిన్న తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరల్లో ఈరోజు ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో ఇవాళ పెట్రోల్ ధర 94రూపాయల16 పైసలు వద్ద, డీజిల్ ధర 88 రూపాయల 20 పైసలు వద్ద స్థిరంగా ఉన్నాయి. ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 96రూపాయల65 పైసలు వద్ద.. డీజిల్‌ ధర 90 రూపాయల 17 పైసలు వద్ద నిలకడగా కొనసాగుతోంది.

ఆర్దిక రాజధాని ముంబై లో 96 రూపాయల 98 పైసలుగా నమోదవుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.55 శాతం పెరుగుదలతో 64.37 డాలర్లకు చేరగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.25 శాతం పెరుగుదలతో 60.70 డాలర్లకు ఎగసింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story