Petrol Rate: అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గిన ముడి చమురు ధరలు

Petrol Rate: బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.40 శాతం డౌన్ * డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.74 శాతం క్షీణత

Sandeep Eggoju
Published on: 8 April 2021 10:02 AM IST
Petrol and Diesel Price Down in International Markets
X

Representational Image

Petrol Rate: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.40 శాతం తగ్గుదలతో 62.80 డాలర్లకు క్షీణించింది. మరోవైపు డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.74 శాతం క్షీణతతో 59.34 డాలర్లకు తగ్గింది..అయితే దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రోల్ ,డీజిల్ ధరలు మాత్రం నిలకడగా కొనసాగుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇంధన సరఫరా సంస్థలు పెట్రో ధరలను పెంచడం లేదన్న అభిప్రాయం వినవస్తోంది.

రాజధాని ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 90 రూపాయల 56 పైసలుగా వుండగా. డీజిల్ ధర 80 రూపాయల 87 పైసలు వద్దకి చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర 94 రూపాయల 16 పైసలు వద్ద, డీజిల్ ధర 88 రూపాయల 20 పైసలు వద్ద స్థిరంగా ఉన్నాయి.ఏపీలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story