Paytm: తొలగించారు.. తిరిగి పెట్టేశారు.. పేటీఎం తిరిగి గూగుల్ ప్లే స్టోర్ లో!

Paytm: తొలగించారు.. తిరిగి పెట్టేశారు.. పేటీఎం తిరిగి గూగుల్ ప్లే స్టోర్ లో!
x
Highlights

Paytm | గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలిగించబడింది.. అయితే తమ నిబంధనలను ఉల్లగించడం వలనే పేటీఎం యాప్ ను తొలిగించినట్లుగా గూగుల్ అధికారికంగా వెల్లడించింది..

Paytm | గూగుల్ ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలిగించబడింది.. అయితే తమ నిబంధనలను ఉల్లగించడం వలనే పేటీఎం యాప్ ను తొలిగించినట్లుగా గూగుల్ అధికారికంగా వెల్లడించింది.. వినియోగదారుల సురక్షితను దృష్టిలో పెట్టుకుని గూగుల్ ప్లే స్టోర్ ను రూపొందించామని వెల్లడించింది.. తాము ఎలాంటి ఆన్‌లైన్ కాసినోలకు లేదా జూదం యాప్‌లకు అనుమతించలేదని తెలిపింది.

కానీ పేటీఎం యాప్.. కస్టమర్లు క్యాష్ ప్రైజులు గెలిచేలా రియల్ టోర్నమెంట్లకు సంబంధించి స్పోర్ట్స్ బెట్టింగ్ నిర్వహిస్తోందని తెలిపింది. అందుకే తాము ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించినట్లు స్పష్టం చేసింది. కాగా, ప్లేస్టోర్‌లో పేటీఎం బిజినెస్, పేటీఎం మాల్, పేటీఎం మనీ యాప్‌లు మాత్రం ఉన్నాయి.

గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించడంపై పేటీఎం స్పందించింది. గూగుల్‌ ప్లేలో ప్రస్తుతానికి పేటీఎం ఆండ్రాయిడ్‌ యాప్‌ కొత్తగా డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి, అప్‌డేట్‌ చేసుకోవడానికి అందుబాటులో లేదని పేర్కొంది. త్వరలో మళ్లీ సేవలు ప్రారంభమవుతాయని తెలిపింది. ప్రస్తుతానికి పేటీఎం యాప్‌ను యథావిధిగా వినియోగించుకోవచ్చని, అందులో సొమ్ముకు ఎలాంటి ఢోకా లేదని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం పేటీఎంకు 5 కోట్ల మంది నెలవారీ యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. పేటీఎం ఐవోఎస్‌ వెర్షన్‌ మాత్రం యథావిధిగా కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories