Oppo Reno Ace సూపర్ ఫీచర్స్.. చైనాలో రేపే విడుదల.. ధర ఎంతో?

Oppo Reno Ace సూపర్ ఫీచర్స్.. చైనాలో రేపే విడుదల.. ధర ఎంతో?
x
Highlights

మొబైల్ ఫోన్ల మార్కెట్ లో సంచలనం సృష్టించిన ఒప్పో రెనో 2 సిరీస్ గుర్తుందిగా. ఇప్పుడు మళ్లీ ఒప్పో ఆ సంచలనాన్ని రిపీట్ చేయడానికి సిద్ధం అయిపొయింది. ఒప్పో రెనో ఏస్ స్మార్ట్ ఫోన్ రేపు చైనాలో విడుదల చేయనున్నారు.

మొబైల్ ఫోన్ల మార్కెట్ లో సంచలనం సృష్టించిన ఒప్పో రెనో 2 సిరీస్ గుర్తుందిగా. ఇప్పుడు మళ్లీ ఒప్పో ఆ సంచలనాన్ని రిపీట్ చేయడానికి సిద్ధం అయిపొయింది. ఒప్పో రెనో ఏస్ స్మార్ట్ ఫోన్ రేపు చైనాలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఒప్పో సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ ఫోన్ లో ఉండే ఫీచర్లను ఒప్పో సంస్థ వైస్ ప్రెసిడెంట్ బ్రియాన్ షెన్ వెల్లడించారు. అత్యంత వేగవంతమైన క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855+ ప్రాసెసర్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ గల స్క్రీన్ ఈ ఫోన్ లో ప్రధాన ఆకర్షణ గా షెన్ తెలిపారు. అదేవిధంగా ఈ ఫోన్ కోసం Gundam Edition పేరిట ప్రత్యేక ఎడిషన్ ను కూడా రూపొందించినట్లు అయన చెప్పారు. ఇందులో 135 హెర్ట్జ్ శాంపిల్ రేట్ తో కూడిన 90 హెర్ట్జ్ డిస్ ప్లే తో పాటు, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వరకు వేరియంట్లు ఉంటాయన్నారు. యూఎఫ్ఎస్ 3.0 ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది.

ఒప్పొ రెనో ఏస్ ప్రాధాన ఫీచర్లు ఇవేనట ..

- వెనుక వైపు నాలుగు కెమెరాలు.. మెయిన్ కెమెరా 48 మెగా పిక్సెల్.. మిగిలినవి 13 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్

- సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్

- 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ(AMOLED) స్క్రీన్ రిజల్యూషన్ 1080x2400 పిక్సెల్స్ ఉండవచ్చు.

- దీని బ్యాటరీ సామర్థ్యం 4,000 ఎంఏహెచ్ గా ఉంది. 65W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ ముఖ్యమైనదని తెలుస్తోంది.

- ఈ స్మార్ట్ ఫోన్ 16.1 సెంటీమీటర్ల పొడవు, 7.57 సెంటీమీటర్ల వెడల్పు, 0.87 సెంటీమీటర్ల మందం ఉండనున్నట్లు తెలుస్తోంది. దీని బరువు 200 గ్రాములు.

- ఇందులో వైఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్ బీ టైప్-సీ వంటి మరిన్ని ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

ధర ఎంత ఉండొచ్చు?

ఇప్పటి వరకూ అందుతున్న వివరాల ప్రకారం రెనో సిరీస్ లో రెనో 2Z ధర రూ.29,990గా ఉండగా, రెనో 2 ధర రూ.36,990గానూ, రెనో 2F ధర రూ.25,990గా ఉన్నాయి. కాబట్టి దీని ధర కూడా దాదాపు ఈ శ్రేణిలోనే ఉండే అవకాశం ఉంది.

రూ.29,990గా ఉండనుందని భావిస్తున్నారు. ఈ ధర విషయం.. ఫీచర్ల విషయం పూర్తిగా తేలాలంటే పదో తేదీ వరకూ ఆగాల్సిందే!


Show Full Article
Print Article
More On
Next Story
More Stories