Tata Group : నోయల్ టాటా మ్యాజిక్.. ఇండియాలో నంబర్ 1 బ్రాండ్ గా టాటా గ్రూప్

Tata Group : నోయల్ టాటా మ్యాజిక్.. ఇండియాలో నంబర్ 1 బ్రాండ్ గా టాటా గ్రూప్
x

Tata Group : నోయల్ టాటా మ్యాజిక్.. ఇండియాలో నంబర్ 1 బ్రాండ్ గా టాటా గ్రూప్

Highlights

టీవీలోనో, పేపర్‌లలోనో 'బ్రాండ్ వాల్యూ' పేరు వినే ఉంటారు. అంటే, ఒక కంపెనీకి మార్కెట్‌లో ఎంత విలువ, ఎంత పేరు ఉంది అని చెప్పే లెక్క అన్నమాట.

Tata Group : టీవీలోనో, పేపర్‌లలోనో 'బ్రాండ్ వాల్యూ' పేరు వినే ఉంటారు. అంటే, ఒక కంపెనీకి మార్కెట్‌లో ఎంత విలువ, ఎంత పేరు ఉంది అని చెప్పే లెక్క అన్నమాట. ప్రస్తుతం టాటా గ్రూప్ మన భారతదేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. 'బ్రాండ్ ఫైనాన్స్' అనే సంస్థ 'ఇండియా 100 రిపోర్ట్ 2025'లో ఈ విషయాన్ని వెల్లడించింది. టాటా గ్రూప్ బ్రాండ్ విలువ ఈ సంవత్సరం 10% పెరిగిందట. అంతేకాదు, ఏకంగా 30 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,50,000 కోట్ల) మార్కును దాటిన మొదటి భారతీయ బ్రాండ్‌గా టాటా చరిత్ర సృష్టించింది. దీని వెనుక నోయల్ టాటా వంటి వాళ్ల కృషి చాలా ఉంది.

ఈ రిపోర్ట్‌లో.. మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉందంట, జీడీపీ (GDP) వృద్ధి రేటు 6-7శాతం ఉంటుందని అంచనా. కాబట్టి, భారతీయ కంపెనీలకు తమ బ్రాండ్ విలువను పెంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మన దేశంలో డిమాండ్ బాగా పెరగడం, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలు, అలాగే పెట్టుబడులు ఎక్కువ అవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కొన్ని సమస్యలు ఉన్నా సరే, మన కంపెనీలు మాత్రం పరుగులు తీస్తున్నాయట. ఈ ఏడాది రిపోర్ట్‌లో ఇంకో విశేషం ఏంటంటే, మన దేశంలోని టాప్ 10 బ్రాండ్‌ల విలువ రెండు అంకెలలో పెరిగింది. అంటే పది శాతం కంటే ఎక్కువే పెరిగినట్లు.

టాటా తర్వాత ఎవరున్నారు?

ఇన్ఫోసిస్ ఈ లిస్ట్‌లో రెండో స్థానంలో ఉంది. దీని బ్రాండ్ విలువ 15% పెరిగి 16.3 బిలియన్ డాలర్లకు చేరింది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఇన్ఫోసిస్ ఎంత గొప్పదో తెలిసిందే. హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ మూడో స్థానంలో ఉంది. ఏకంగా 37% భారీ పెరుగుదలతో 14.2 బిలియన్ డాలర్ల బ్రాండ్ విలువను సాధించింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో వీళ్ళ దూకుడు మామూలుగా లేదు. ఎల్‌ఐసీ నాలుగో స్థానంలో ఉంది. దీని బ్రాండ్ విలువ 35% పెరిగి 13.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయినా, దీనికి ఇంకా గట్టి పట్టు ఉంది.

హెచ్‌సిఎల్ టెక్ బ్రాండ్ విలువ 17% ఎగిసి 8.9 బిలియన్ డాలర్లకు చేరింది. లార్సన్ & టూబ్రో గ్రూప్ దీని విలువ 3% పెరిగి 7.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మహీంద్రా గ్రూప్ కూడా టాప్ 10లో చోటు సంపాదించుకుంది. దీని విలువ 7.2 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది రిపోర్ట్‌లో అదానీ గ్రూప్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా నిలిచింది. దీని బ్రాండ్ విలువలో ఏకంగా 82శాతం పెరుగుదల నమోదైంది. అదానీ గ్రూప్‌కి గతంలో కొన్ని సమస్యలు వచ్చినా, ఇప్పుడు బలంగా పుంజుకున్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి.

2025 'ఇండియా 100 రిపోర్ట్' ప్రకారం, భారతదేశంలోని టాప్ 100 బ్రాండ్‌ల మొత్తం బ్రాండ్ విలువ 236.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది నిజంగా మన దేశ ఆర్థిక ప్రగతికి, కార్పొరేట్ కంపెనీల బలానికి స్పష్టమైన సూచన. టాటా గ్రూప్ సాధించిన ఈ చారిత్రక విజయం, ప్రపంచ బ్రాండింగ్ మ్యాప్‌లో భారతదేశాన్ని మరింత బలంగా నిలబెట్టింది. ఇక అదానీ, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, ఎల్‌ఐసీ వంటి కంపెనీలు కూడా భారతీయ కంపెనీలు ప్రపంచ స్థాయిలో పోటీ పడటంలో ఏమాత్రం వెనుకబడలేదని నిరూపించాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories