LIC: ఎల్ఐసీ పాలసీదారులకి శుభవార్త.. ఈ ప్రత్యేక ఆఫర్ వచ్చేసింది..!

LIC: ఎల్ఐసీ పాలసీదారులకి ఇది శుభవార్తని చెప్పాలి. మీ పాలసీలలో ఏదైనా ల్యాప్ అయినట్లయితే ఇప్పుడు సరిదిద్దుకోవచ్చు.

Arun Chilukuri
Updated on: 18 Aug 2022 1:01 PM IST
LIC Special Campaign to Revive Lapsed Policies Chek for all Details
X

LIC: ఎల్ఐసీ పాలసీదారులకి శుభవార్త.. ఈ ప్రత్యేక ఆఫర్ వచ్చేసింది..!

LIC: ఎల్ఐసీ పాలసీదారులకి ఇది శుభవార్తని చెప్పాలి. మీ పాలసీలలో ఏదైనా ల్యాప్ అయినట్లయితే ఇప్పుడు సరిదిద్దుకోవచ్చు. వ్యక్తిగత బీమాతో పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఎల్‌ఐసీ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. ఎల్‌ఐసి విడుదల చేసిన ఒక ప్రకటనలో "యులిప్‌లు మినహా అన్ని పాలసీలను ఆలస్య రుసుముతో ప్రత్యేక ప్రచారం కింద పునరుద్ధరించవచ్చు. ఇది ఆగస్టు 17న ప్రారంభమవుతుంది అక్టోబర్ 21, 2022 వరకు కొనసాగుతోంది.

యులిప్‌లు కాకుండా అన్ని పాలసీలు కొన్ని షరతులకు లోబడి మొదటి ప్రీమియంలో డిఫాల్ట్ అయిన తేదీ నుంచి 5 సంవత్సరాల వ్యవధిలో పునరుద్ధరించవచ్చు. మైక్రో-ఇన్సూరెన్స్ పాలసీలకు ఆలస్య రుసుముపై 100 శాతం తగ్గింపు ఉంటుంది. తద్వారా నష్టాన్ని కవర్ చేయవచ్చని ఎల్ఐసీ తెలిపింది. ఏ కారణం చేతనైనా ప్రీమియం చెల్లించలేని పాలసీదారుల కోసం ఈ ప్రత్యేక ప్రచారం ప్రారంభించారు. ఎల్ఐసీ ప్రకారం ఒక లక్ష రూపాయల వరకు మొత్తం ప్రీమియం కోసం ఆలస్య రుసుములో 25 శాతం రాయితీ ఉంటుంది.

గరిష్ట మినహాయింపు రూ.3,500

గరిష్ట మినహాయింపు పరిమితి రూ.2,500. అదే సమయంలో రూ.1 నుంచి 3 లక్షల ప్రీమియం కోసం గరిష్ట మినహాయింపు పరిమితి రూ. 3,000. అదేవిధంగా ఆలస్య రుసుములో గరిష్టంగా రూ.3,500 రాయితీతో రూ.3 లక్షల కంటే ఎక్కువ ప్రీమియంపై 30 శాతం రాయితీ ఇస్తున్నారు. పాలసీదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే మంచిది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story