కొత్త పాత పెన్షన్ వివాదాల మధ్య గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్.. అంటే ఏంటో తెలుసుకోండి..!
Guaranteed Pension Scheme: పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
కొత్త పాత పెన్షన్ వివాదాల మధ్య గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్.. అంటే ఏంటో తెలుసుకోండి..!
Guaranteed Pension Scheme: పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి కూడా. ఇది దేశ వ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పాత పెన్షన్ అమలు చేస్తామని రాజకీయ పార్టీలు వాగ్దానం చేస్తున్నాయి. దీనిపై నిపుణులందరితో పాటు ఆర్బీఐ కూడా భవిష్యత్తులో కష్టమేనని తేల్చిచెబుతోంది. వీటన్నింటి మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొత్త పెన్షన్ స్కీమ్ చర్చనీయాంశమైంది.
ఇందులో కొత్త, పాత పెన్షన్ రెండింటికి సంబంధించిన నిబంధనలు చేర్చారు. దీనికి ప్రభుత్వం గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ (GPS) అని పేరు పెట్టారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. ఆర్థిక శాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దానిపై కసరత్తు చేస్తోందని వివిధ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పెన్షన్ స్కీమ్‌లోని ప్రత్యేకత ఏంటంటే కొత్త పెన్షన్, పాత పెన్షన్ స్కీమ్ రెండింటినీ ఇందులో పొందుపరిచారు.
గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏమిటి..?
GPS కింద ఒక ఉద్యోగి తన బేసిక్ జీతంలో ప్రతి నెలా 10 శాతాన్ని డిపాజిట్ చేస్తే రిటైర్మెంట్ తర్వాత అతను 33 శాతం పెన్షన్‌గా పొందుతాడు. రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం జీపీఎస్‌లో కూడా జమ చేస్తుంది. ఇందులోని రెండవ నిబంధన ఏంటంటే ఉద్యోగి తన జీతంలో 14 శాతం డిపాజిట్ చేస్తే పదవీ విరమణ తర్వాత అతనికి 40 శాతం వరకు పెన్షన్ లభిస్తుందని భావిస్తున్నారు.
అయితే ఈ రకం పెన్షన్‌ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా లేదు. ఇది చాలా ఆసక్తికరమైన మోడల్ అని కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పాత పెన్షన్ స్కీమ్ కింద, ఉద్యోగి చివరి జీతంలో 50 శాతం పెన్షన్ పొందేవారు. పెన్షన్‌గా వచ్చే మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. అదే సమయంలో నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో దీర్ఘకాలిక పెట్టుబడి విధానం ఉంటుంది. దీని కింద పదవీ విరమణ తర్వాత ఉద్యోగి ఒకేసారి పెద్ద ఫండ్ పొందుతారు. ఇందులో పెట్టుబడి పెట్టే వ్యక్తికి 80-CCD (1B) కింద రూ.50,000 తగ్గింపు లభిస్తుంది. ఇది కాకుండా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80-సి కింద రూ. 1.5 లక్షల వరకు రాయితీ లభిస్తుంది.


