Invest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!

Invest Money: ఈ రోజుల్లో ప్రజలు తమ డబ్బుని పెట్టుబడి పెట్టేముందు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే డిజిటల్ మోసాల కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి.

Arun Chilukuri
Updated on: 12 Aug 2022 8:00 PM IST
Invest in These Government Schemes and Double your Money
X

Invest Money: వీటిలో పెట్టుబడి పెడితే మీ డబ్బులు రెట్టింపు..!

Invest Money: ఈ రోజుల్లో ప్రజలు తమ డబ్బుని పెట్టుబడి పెట్టేముందు ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే డిజిటల్ మోసాల కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్‌లో ఒడిదుడుకులు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో భద్రత, హామీతో కూడిన పెట్టుబడిని రెట్టింపు చేయడానికి మీరు చాలా కాలం వేచి ఉండాలి. ఒక్కసారి సురక్షితమైన పెట్టుబడి ఎంపికలను పరిశీలిస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్, పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్ర (KVP)నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC), నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) టైర్-2 వంటి ఎంపికలు ఉన్నాయి.

మ్యూచువల్ ఫండ్

మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు డబ్బును రెట్టింపు చేయగలవు. 4-5 సంవత్సరాలలో రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌లో రిస్క్ ఉండదు కానీ మీరు డబ్బును త్వరగా రెట్టింపు చేయాలనుకుంటే రిస్క్‌ తీసుకోవాల్సిందే.

బ్యాంక్ ఎఫ్‌డి

రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచిన తర్వాత చాలా బ్యాంకులు తమ ఎఫ్‌డి వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ప్రస్తుతం ఎఫ్‌డిపై సగటున 6 శాతం వడ్డీ ఉంది. ఈ పరిస్థితిలో మీ డబ్బు రెట్టింపు కావడానికి సుమారు 12 సంవత్సరాలు పడుతుంది.

పీపీఎఫ్‌

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పెట్టుబడి పెట్టడానికి మంచి మార్గం. ఇది ప్రస్తుతం సంవత్సరానికి 7.1 శాతం వడ్డీని అందిస్తోంది. కాబట్టి మీ డబ్బు రెట్టింపు కావడానికి 10.14 సంవత్సరాలు పడుతుంది.

సుకన్య సమృద్ధి యోజన

మీరు మీ కుమార్తె పేరు మీద సుకన్య ఖాతాను తెరిస్తే మీ డబ్బు 9.4 సంవత్సరాలలో రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం సుకన్య యోజనలో ఏడాదికి 7.6 శాతం వడ్డీ అందుతోంది.

కిసాన్ వికాస్ పత్ర

కిసాన్‌ వికాస్‌ పత్ర పెట్టుబడికి మెరుగైన ప్రభుత్వ పథకం. ఇది ప్రస్తుతం సంవత్సరానికి 6.9 శాతం గ్యారెంటీ వడ్డీ రేటును అందిస్తోంది. ఈ పరిస్థితిలో ఈ ఎంపిక మీ డబ్బును 10.43 సంవత్సరాలలో రెట్టింపు చేస్తుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story