లాభాల బాటన దేశీ స్టాక్ మార్కెట్లు ..

* ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు దూకుడు .. * సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు మేర ర్యాలీ .. * నిఫ్టీ 50 సైతం 14,500 పాయింట్ల ఎగువకు ..

Sandeep Eggoju
Published on: 2 Feb 2021 9:56 AM IST
Indian Stock Markets are in the Path of  Profit
X

Representational Image

దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాటన దూకుడుగా సాగుతున్నాయి..ఆరంభ ట్రేడింగ్ లో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ వెయ్యి పాయింట్లు మేర ర్యాలీ చేయగా..నిఫ్టీ 50 సైతం 14,500 పాయింట్ల ఎగువకు చేరింది ఆర్థిక వృద్ధి ప్రధాన లక్ష్యంగా రూపుదిద్దుకున్న బడ్జెట్‌ - 2021కు స్టాక్ మార్కెట్ సాదరంగా ఆహ్వానం పలికిన నేపధ్యంలో సూచీలు లాబాల బాటన పరుగులు తీస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, బీమా రంగంలో ఎఫ్‌డీఐల పరిమితిని 74 శాతానికి పెంచడం, డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహం తదితర కార్పొరేట్‌ అనుకూల నిర్ణయాలు మార్కెట్‌ వర్గాలను ఆకట్టుకోగలిగాయి ప్రస్తుతం సెన్సెక్స్ 1400 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్ల మేర లాభాల్లో కొనసాగుతున్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story