అత్యవసరంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేయాలా.. కచ్చితంగా ఈ నియమాలు తెలుసుకోండి..!
FD Money Withdraw: ఈరోజుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లని సురక్షితమైన పెట్టుబడి సాధనాలుగా చెప్పవచ్చు.
అత్యవసరంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేయాలా.. కచ్చితంగా ఈ నియమాలు తెలుసుకోండి..!
FD Money Withdraw: ఈరోజుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లని సురక్షితమైన పెట్టుబడి సాధనాలుగా చెప్పవచ్చు. ఈ స్కీంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీ డబ్బు కొంత కాలానికి లాక్ చేస్తారు. ఇది మెచ్యూరిటీ తర్వాత మీకు మంచి రాబడిని అందిస్తుంది. మీరు లాక్ ఇన్ పీరియడ్‌ని ఎంచుకుని తదనుగుణంగా పెట్టుబడి పెట్టవచ్చు. కానీ కొన్ని కారణాల వల్ల మీకు మధ్యలో డబ్బు అవసరమైతే మెచ్యూరిటీకి ముందే FDని బ్రేక్ చేయవచ్చు. దీనిని ప్రీ-మెచ్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ విత్‌డ్రాయల్ అంటారు. ఇందుకు కొన్ని నియమాలు ఉంటాయి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఆర్‌బిఐ రెపో రేటు పెరిగిన తర్వాత బ్యాంకులు ఎఫ్‌డిలపై వడ్డీ రేట్లను బాగా పెంచాయి. ఈ పరిస్థితిలో ప్రజలు తమ పాత FD నుంచి డబ్బును విత్ డ్రా చేసి కొత్త FD కోసం ప్లాన్ చేస్తున్నారు. చాలా బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు FDలపై 9% వరకు వడ్డీని ఇస్తున్నాయి. సాధారణ పౌరులకు గరిష్టంగా 7 నుంచి 7.5% వడ్డీని అందిస్తున్నాయి. మీరు అత్యవసర పరిస్థితుల్లో FD విత్‌డ్రా చేయాలంటే బ్యాంకుకి సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి.
మెచ్యూర్‌కు ముందు FD మూసివేతపై బ్యాంకులు కొంత పెనాల్టీ విధిస్తాయి. FDని బ్రేక్ చేసే ముందు తప్పనిసరిగా ఆ నియమాలను తెలుసుకోవాలి. పెనాల్టీ అనేది వడ్డీ రేటులో 0.5% నుంచి 3% వరకు ఉంటుంది. మీరు సమీపంలోని బ్యాంక్ లేదా NBFC, మొబైల్ యాప్, నెట్ బ్యాంకింగ్ శాఖ నుంచి FDని క్లోజ్ చేయవచ్చు. FD అనేది పన్ను ఆదాతో పాటు రాబడుల ప్రయోజనాన్ని అందిస్తుంది. దీని కింద మీరు ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.




